కెసిఆర్‌ను హైదరాబాద్ ప్రజలు తరిమికొడతారు: ఎర్రబెల్లి

పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం, హైదరాబాద్‌పై గవర్నర్ అధికారానికి సంబంధించిన విషయాలు కె చంద్రశేఖర్ రావుకు ముందే తెలుసని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అయినా కూడా ఆయన ఆ రోజు పార్లమెంటులో కెసిఆర్ నోరు మెదపలేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ ఏ విషయంపైనా స్పష్టత ఇవ్వలేదని అన్నారు.
కేజీ నుంచి నుంచి పీజీ వరకు ఉచిత విద్య హామీ ఏమైందని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. అభివృద్ధిపై దృష్టిపెట్టకుండా ఏపి సిఎం చంద్రబాబునాయుడును తిట్టడం ద్వారా ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ ప్రత్యేక అధికారాలపై కెసిఆర్ రాజకీయ చేస్తున్నారని అన్నారు. పోలవరం ముంపు గ్రామాలు, గవర్నర్‌కు అధికారాలు యూపిఏ తీసుకున్న నిర్ణయాలేనని చెప్పారు.
గురుకుల్ ట్రస్ట్ భూముల్లో సామాన్యులు లక్ష్యంగానే చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. పెద్దవాళ్లకు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే అవకాశం కల్పించారని అన్నారు. గతంలో గురుకుల్ ట్రస్ట్ నిర్మాణాల కూల్చివేతను ప్రస్తుత టిఆర్ఎస్ ఎంపి కవిత అడ్డుకున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు చేశారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని టిఆర్ఎస్, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకుల అక్రమ నిర్మాణాల జోలికెళ్లడం లేదని ఆరోపించారు. అయ్యప్ప సొసైటీలో చంద్రబాబుకు ఒక్క గజం ఉన్న తిరిగి ఇచ్చేందుకు సిద్ధమని ఎర్రబెల్లి తెలిపారు.












Click it and Unblock the Notifications