ఎర్రబెల్లి ట్విస్ట్: కేసీఆర్‌పై ఆగ్రహం, 10నుండి బస్సుయాత్ర

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు సోమవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి టీడీపీలో చేరనున్నారనే ఊహాగానాలు ఇటీవల వినిపించిన విషయం తెలిసిందే. మరో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డితో మెట్రో విషయంలో విభేదించారు. కేసీఆర్‌తో భేటీ అయ్యారు. దీంతో ఎర్రబెల్లి కారు ఎక్కుతారనే ప్రచారం సాగింది.

అయితే, అనూహ్యంగా సోమవారం ఎర్రబెల్లి ముఖ్యమంత్రి పైన మండిపడ్డారు. కేసీఆర్ అసమర్థత వల్లే తెలంగాణలో విద్యుత్ కోతలు అని ధ్వజమెత్తారు. కేసీఆర్ కావాలనే తమ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పైన విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారన్నారు. పొలాలు ఎండిపోతున్నప్పటికీ ప్రభుత్వం విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

Errabelli U turn: lashes out at KCR

10 నుండి బస్సుయాత్ర

తెలంగాణలో తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బస్సుయాత్ర నిర్వహించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ నెల 10వ తేదీ నుండి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల 10న నల్గొండ, 11న వరంగల్, 12న అదిలాబాద్ జిల్లాలో ఈ యాత్ర సాగనుంది.

మంత్రులదే కీలక పాత్ర: డీకే అరుణ

తెలంగాణలో ఇసుక మాఫియాలో మంత్రులదే కీలక పాత్ర అని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ వేరుగా ఆరోపించారు. మరో కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణ రెడ్డి కూడా తెరాస ప్రభుత్వంపై మండిపడ్డారు.

డీజిల్ లేక 108 వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో మంచి పాలకులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రపంచానికి తప్పుడు సంకేతం ఇచ్చిన హిట్లర్‌తో పోల్చుకోవడం సరికాదన్నారు. విద్యుత్ ఇవ్వలేకపోతే రైతులు పంటలు వేసుకోవద్దా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+