శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసుకోండి:వైసిపి ఎమ్మెల్యేలకు టిడిపి ఎమ్మెల్యే సలహా
గుంటూరు:వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య విలువలతో కూడిన ఒక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవాలని...ఆ అవసరం ఎంతైనా ఉందని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సూచించారు.
పెదకూరపాడు నియోజకవర్గంలోని తాడ్వాయి గ్రామంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవటం దురదృష్టకరమని...ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రతిపక్ష నాయకులు ఒక వేదిక మీదకు రావాలన్నారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకు తిరిగే వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలన్నారు. వాళ్లు రోడ్ల వెంబడి తిరుగుతూ అనవసర వ్యాఖ్యలు చేయటం తగదని కొమ్మాలపాటి హితవు పలికారు.

గ్రామస్ధాయిలో టిడిపి ప్రభుత్వం అనేక సమస్యలు పరిష్కరిస్తూ ముందుకుపోతుందని...గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి దశదిశ నిర్దేశిస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం ఎన్నికల కోసం మాత్రమే జనాల దగ్గరకు వస్తున్నారని, ప్రజా సమస్యలపై రావటం లేదని విమర్శించారు.
చంద్రబాబు రైతు రుణవిముక్తి, నదుల అనుసంధానం చేస్తామని అంటే జగన్మోహన్‌రెడ్డి అసాధ్యమని అన్నారని గుర్తుచేశారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రెండింటిని చేసి చూపించిందని ఎమ్మెల్యే కొమ్మాలపాటి చెప్పారు. రాబోయే రోజుల్లో ఆరుతడులకు నీళ్ళు ఇస్తామన్నారు. తన నియోజకవర్గం పరిధిలో వైసీపీ నాయకులు చేసిన రాద్ధాంతం వల్ల కస్తల గ్రామంలో సుమారు 2 వేల మంది ఇసుక కార్మికులు రోడ్డున పడ్డారని, ఇసుక రేట్లు కూడా పెరిగాయని చెప్పుకొచ్చారు.
Recommended Video

వైసీపీకి అధికారం ఒక కలగానే మిగిలిపోతుందని ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ ఎద్దేవా చేశారు. బీసీలు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలుగా అభివర్ణించారు. ఇకనైనా ప్రతిపక్ష నాయకులు కళ్ళు తెరవాలని అన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications