వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేయి చేసుకున్న సీయం ర‌మేష్‌: మ‌ంగ‌ళ‌గిరిలో ఆర్కే ధ‌ర్నా : ఓట‌ర్ల స‌హ‌నానికి ఇవియంల ప‌రీక్ష‌..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Elections 2019 : YCP ఏజెంట్ పై.. చేయి చేసుకున్న సీయం ర‌మేష్‌..!! || Oneindia Telugu

ఎపిలో ఓట‌రు చైతన్యం వెల్లి విరుస్తోంది. పోలింగ్ బూత్ ల‌కు ఓట‌ర్లు పోటెత్తుతున్నారు. ఇదే స‌మ‌యంలో అనేక చోట్ల ఇవియం లు సాంకేతిక స‌మ‌స్య‌ల‌తో స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతున్నాయి. ఇక‌, పోలింగ్ ప్రారంభం అయిన తొలి రెండు గంట‌ల్లో అనేక చోట్ల స్వ‌ల్ప ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి.

సీయం ర‌మేష్‌..వైసిపి కార్య‌క‌ర్త‌ల వాగ్వాదం..
క‌డ‌ప జిల్లా ప్రొద్ద‌టూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో టిడిపి..వైసిపి శ్రేణుల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ త‌రువాత అది ఉద్రిక్త‌త కు దారి తీసుంది. టిడిపి రాజ్య‌స‌భ స‌భ్యుడు సీయం ర‌మేష్ స్వ‌గ్రామం అయిన పోట్ల‌దుర్తి లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు సీయం ర‌మేష్ ప్ర‌య‌త్నించారు. ఆ స‌మ‌యంలో వైసిపి ఏజెంట్లు అడ్డుకున్నారు. ఆ స‌మ‌యంలో మొద‌లైన వాగ్వాదం సీయం ర‌మేష్ స‌హ‌నం కోల్పోయి త‌మ పై చేయి చేసుకున్నార‌ని వైసిపి కార్య‌క‌ర్త‌లు ఆరోపిస్తున్నారు. దీంతో..పోలీసులు రంగ ప్ర‌వేశం చేసారు. రెండు వ‌ర్గాల‌ను అక్క‌డి నుండి పంపిం చి వేయ‌టంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది. ఇక‌, ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సంతమాగులూరు మం డలం తంగెడుమల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్‌ కేంద్రంలోకి వైసీపీ అభ్యర్థి గరటయ్య పార్టీ కండువా తో వచ్చారు. దీంతో ఎన్నికల అధికారులు అభ్యంతరం తెలిపారు.

EVMs problem is high in AP polling : YCP Mla Candidate protest against Officers negligence

మంగ‌ళ‌గిరి వైసిపి అభ్య‌ర్ది ధ‌ర్నా..
టిడిపి..వైసిపి ప్ర‌తిష్ఠాత్మ‌కం తీసుకున్న గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో అధికారుల తీరును నిర‌సిస్తూ వైసిపి అభ్య‌ర్ది ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ధ‌ర్నాకు దిగారు. పోలింగ్ ప్రారంభ‌మై రెండు గంట‌లు అయినా ఇంకా ప‌లు బూత్ ల్లో పోలింగ్ ప్రారంభం కాక‌పోవ‌టం పై అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. అనేక మంది ఓట‌ర్లు చాలా సేపు నిరీక్షించి తిరిగి వెన‌క్కు మళ్ళుతున్నారు. దీంతో..వైసిపి అభ్య‌ర్ది ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘం తో పాటుగా రిట‌ర్నింగ్ అధికారితో మాట్లాడారు. వారి నుండి స‌రైన స్పంద‌న రాక‌పోవ‌టంతో ఓట‌ర్ల‌తో క‌లిసి ధ‌ర్నాకు దిగారు. దీని పై ఎన్నిక‌ల సంఘ సీఈవో నియోజ‌క‌వ‌ర్గ రిట‌ర్నింగ్ అధికారిని వివ‌ర‌ణ కోరారు. అధికారుల తీరు పై ఆర్కే తో పాటుగా ఓట‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

English summary
Small disturbances in AP polling. Voters q lines are seem to be heavy in all segments. EVM's problems arised in many places. Mnagalagirir ycp mla candidate protest against officers negligence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X