వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవుడి నిర్ణయంతో ఏపీలో పవన్ కళ్యాణ్ ముందడుగు: కలయిక వెనుక ఆ రెండు!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత డి కుమార స్వామి కలవడం పైన ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ప్రధానంగా పవన్‌తో రాజకీయంగా కలవడం కోసం, తన కొడుకును హీరోగా నిలబెట్టడం కోసం కలిశారని అంటున్నారు.

హోదాపై తొందరపడనన్న పవన్ కళ్యాణ్‌పై రోజా తీవ్రవ్యాఖ్య, అసలేమన్నాడు?హోదాపై తొందరపడనన్న పవన్ కళ్యాణ్‌పై రోజా తీవ్రవ్యాఖ్య, అసలేమన్నాడు?

పవన్ కళ్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలోను బాగానే ఉంది. 2018లో కర్నాటకలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జేడీఎస్ తరఫున ప్రచారం నిర్వహించాలని కుమారస్వామి.. పవన్‌ను కలిసినప్పుడు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.

కర్నాటకలో వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తే జేడీఎస్‌కు బాగా కలిసి వస్తుందని, లబ్ధి చేకూరుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయని అంటున్నారు.

భేటీ అనంతరం డి కుమార స్వామి మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్‌తో స్నేహం ఉందని, ఆ కారణంగానే కలవడానికి వచ్చానని చెప్పారు. కర్నాటక ఎన్నికలు, ఇతర రాజకీయ అంశాల గురించి ఆయనతో చర్చించలేదని చెప్పడం గమనార్హం.

అలాగే, తన కుమారుడు నిఖిల్ కుమారస్వామి సినిమా జాగ్వార్ తెలుగులోను విడుదల చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆశీస్సుల కోసం వచ్చామని చెప్పడం గమనార్హం. గత ఎనిమిదేళ్లుగా పవన్, నేను మిత్రులమని, తనకు సోదరుడు, నేను ఆయనకు ఫ్యాన్‌ను అని చెప్పారు.

మాటమార్చిన పవన్ కళ్యాణ్: బాబు దారిలో... మనసులో ఏముంది?ఏపీ రాజకీయాల్లో పవన్‌కు ప్రత్యేక స్థానం ఉందని, సరైన సమయంలో దేవుడి నిర్ణయం మేరకు ఆయన ముందడుగు వేస్తారని కుమారస్వామి చెప్పారు. నిర్మాతగా మీతో బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించాలని ఉందని పవన్‌తో చెప్పానన్నారు. ఆంధ్ర, కర్నాటక అంతర్రాష్ట్ర నదీ వివాద అంశాలపై మాట్లాడామని కూడా కుమార స్వామి చెప్పారు.

దేవుడు నిర్ణయం మేరకు..

దేవుడు నిర్ణయం మేరకు..

ఏపీ రాజకీయాల్లో పవన్‌కు ప్రత్యేక స్థానం ఉందని కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. సరైన సమయంలో దేవుడి నిర్ణయం మేరకు ఆయన ముందడుగు వేస్తారని కుమారస్వామి చెప్పారు.

 పవన్ కళ్యాణ్‌తో..

పవన్ కళ్యాణ్‌తో..

రెండేళ్ల తర్వాత కర్నాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మద్దతుతో పాటు, తన కొడుకు హీరోగా చేసే సినిమాను పవర్ స్టార్‌ను ఉపయోగించుకోవడం గమనార్హం.

 కృష్ణా పుష్కరాలు

కృష్ణా పుష్కరాలు

కృష్ణా పుష్కరాలకు ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఆహ్వానం అందిందని కానీ, వెళ్లలేకపోయానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన మాట్లాడుతూ.. అనాలోచితంగా మాట్లాడనని, కేంద్రం ఇవ్వనని చెబితే అప్పుడు స్పందిస్తానని చెప్పారు.

English summary
Former Karnataka Chief Minister H D Kumaraswamy today met Tollywood actor and Jana Sena Party chief Pawan Kalyan at his residence here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X