నోరుజారిన మాజీ మంత్రి
తెలుగుదేశం పార్టీ జోన్-2 ఇన్ ఛార్జి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నోరుజారారు. పార్టీ కార్యక్రమంలో ఒకటి చెప్పబోయి పొరపాటున మరొకటి అనేశారు. వెంటనే ఈ వీడియోమీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులతో పాటూ నెటిజన్లు కూడా పుల్లారావును ఆటాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి ద్దిపాటి వెంకట్రాజు ఆధ్వర్యంలో 'ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి' కార్యక్రమం జరిగింది. జోన్-2 ఇన్ ఛార్జిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పొరపాటున ఫ్లోలో సైకిల్ పోవాలి సైకిల్ పోవాలి అంటూ నినాదాలు చేశారు. పుల్లారావు అలా అనడంతో టీడీపీ శ్రేణులు అవాకయ్యాయి. వెంటనే పొరపాటును గమనించిన పుల్లారావు సారీ, సారీ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. మాజీ మంత్రి నిజం చెప్పారంటూ వైసీపీ సానుభూతిపరులు సెటైర్లు వేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు, మచిలీపట్నం, గుడివాడ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో గుడివాడ మినహా మిగతా రెండు నియోజకవర్గాలకు వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
టీడీపీ నాయకులందరిదీ ఒకటే మాట.
— Sridhar Reddy Avuthu (@SridharAvuthu) April 11, 2023
సైకిల్ పోవాలి.....
గోపాలపురం నియోజకవర్గం ద్వారాకతిరుమల మండలం లో జరిగిన ఇదేం ఖర్మ కార్యక్రమంలో సైకిల్ పోవాలి అంటున్న మాజీ మంత్రి, టీడీపీ నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు pic.twitter.com/UJg2l4h6QN












Click it and Unblock the Notifications