వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పులివెందుల‌లో ర‌మ‌ణ దీక్షితులు: జ‌గ‌న్‌తో భేటీ: స‌మావేశంలో జ‌రిగిందేంటి..!

|
Google Oneindia TeluguNews

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో ప్ర‌జా ద‌ర్బార్ రెండు రోజుల పాటు నిర్వ‌హించారు. ఇదే స‌మ‌యంలో అక్క‌డ‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మాజీ ప్ర‌ధానార్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు అక్క‌డ‌కు వ‌చ్చారు. జ‌గ‌న్‌కు ఆశీస్సులు అందించారు. అయితే, ర‌మ‌ణ దీక్షితులు పులివెందుల వ‌చ్చి మ‌రీ జ‌గ‌న్‌ను క‌ల‌వటం..ఆయ‌న‌తో స‌మావేశం అవ్వటం వెనుక అస‌లు విష‌యం ఏంట‌నే ఆస‌క్తి మొద‌లైంది.

పులివెందుల‌కు ర‌మ‌ణ దీక్షితులు..
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మాజీ ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు పులివెందుల వ‌చ్చారు. ఆయ‌న వైసీపీ అధినేత‌ను క‌ల‌వటం కోస‌మే అక్క‌డ‌కు చేరుకున్నారు. ప్ర‌జా ద‌ర్బార్‌లో పార్టీ నేత‌ల‌తో స‌మావేవ‌మైన స‌మ‌యంలో వ‌చ్చిన ఆయ‌న‌కు జ‌గ‌న్ స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌న జ‌గ‌న్‌కు దీక్షితులు ఆశీస్సులు అందించారు. మ‌రి కొద్ది రోజుల్లో ఎన్నిక‌ల ఫ‌లితాలు రానున్నాయి. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ స‌మ‌యంలో కొద్ది రోజులుగా టీడీపీ ప్ర‌భుత్వానికి..ముఖ్య‌మంత్రికి వ్య‌తిరేకంగా అనేక కామెంట్లు చేసిన ర‌మ‌ణ దీక్షితులు పులివెందుల‌కు వ‌చ్చి మ‌రీ జ‌గ‌న్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ర‌మ‌ణ దీక్షితుల‌ను ఆయ‌న ప‌ద‌వి నుండి టీటీడీ త‌ప్పించింది. అప్ప‌టి నుండి టీటీడీలో అనేక అంశాలు..ప్ర‌భుత్వ నిర్ణ‌యాల పైనా ర‌మ‌ణ దీక్షితులు బ‌హిరంగంగానే ఆరోప‌ణ‌లు చేసారు. ఇక‌, ఇప్పుడు ఫ‌లితాల ముందు జ‌గ‌న్‌ను క‌ల‌వ‌టం మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ex TTD chief priest Ramana Deekhsitulu met Jagan and discussed personally..

చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా పోరాటం..
టీటీడీలో జ‌రుగుతున్న ప‌రిణామాల పైన బ‌హిరంగా ఆరోప‌ణ‌లు చేసిన ర‌మ‌ణ దీక్షితులు టీడీపీకి ల‌క్ష్యంగా మారారు. ప్ర‌ధాన అర్చ‌కులుగా ఉన్న‌ప్పుడే ఆయ‌న తిరుమ‌లలో తీసుకుంటున్న నిర్ణ‌యాల‌కు అభ్యంత‌రం చెప్పారు. తిరుమ‌ల లో జ‌రిగిన త్ర‌వ్వ‌కాల పైన అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఆయ‌న తిరుమ‌ల‌కు వ‌చ్చిన బిజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్‌షాకు స్వాగ‌తం ప‌ల‌క‌టం అదే విధంగా తిరుమ‌ల‌లో అక్ర‌మంగా త్ర‌వ్వ‌కాలు జ‌రుగుతున్నాయంటూ ఆ ప్ర‌దేశం చూపించారు. దీంతో ఆయ‌న్ను పాత ఉత్త‌ర్వుల ఆధారంగా ప్ర‌ధాన ఆర్చ‌కుల హోదా నుంది తొలిగించారు.

ఆ త‌రువాత ఆయ‌న ఈ వ్య‌వ‌హారం పైన బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య స్వామి కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసారు. దానికి కావాల్సిన మొత్తం స‌మాచారం ర‌మ‌ణ దీక్షితులు అంద‌చేసారు. ఇది ఇలా ఉంటే ర‌మ‌ణ దీక్షితుల తొలిగింపు వ్య‌వ‌హారం పైన వైసీపీ సైతం వ్య‌తిరేకించింది. ర‌మ‌ణ దీక్షితులుకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తార‌నే న‌మ్మ‌కంతోనే ర‌మ‌ణ దీక్షితులు పులివెందుల‌కు వ‌చ్చి జ‌గ‌న్‌తో స‌మావేశ‌మై..తిరుమ‌ల లో ప‌రిస్థితుల‌ను వివ‌రించిన‌ట్లు చెబుతున్నారు.

English summary
ex TTD main priest Ramana Deekshitulu met jagan in Pulivenudla and blessed him. Now this issued became hot topic in political circles. Ramana Deekshitulu discussed personally with jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X