ఒక్క ఫోన్ కాల్ కొట్టండి...చాలు...అరగంటలో మూయిస్తా: బెల్టు షాపులపై మంత్రి జవహర్

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అమరావతి: రాష్ట్రంలో పూర్తిస్థాయిలో బెల్ట్‌ షాప్స్‌ రద్దుకు కట్టుబడి ఉన్నట్లు ఎక్సైజ్ శాఖా మంత్రి కె.ఎస్. జవహర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా బెల్టుషాపులు నిర్వహిస్తున్నట్లు ఒక్క ఫోన్ చేసి సమాచారం అందిస్తే అరగంటలో వాటిని మూసేయిస్తానని మంత్రి జవహర్ అన్నారు.

సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన మంత్రి జవహర్ ఎక్కడైనా బెల్ట్‌ షాపులు ఉంటే 1100కి కాల్‌ చేయాలని ప్రజలకు సూచించారు. అసలు ఈ బెల్టుషాపులు కాంగ్రెస్‌ హయాంలోనే పురుడుపోసుకున్నాయని విమర్శించారు. ఎవరైనా మద్యం కల్తీ చేసినట్లు తెలిస్తే తీవ్రంగా పరిగణిస్తామని, వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు.

  Boat Mishap : Chandrababu Naidu Statement In AP Assembly
  Excise Minister K.S.Jawahar to Take Actions on illegal Belt Shops

  వివిధ మద్యం షాపులపై ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో 600 మద్యం షాపులు వేరే చోట్లకి తరలించేలా చర్యలు తీసుకున్నామన్నారు. గంజాయి సాగుని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నామని, గంజాయి సాగుచేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి జవహర్‌ స్పష్టం చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  amaravathi: AP Excise Minister Jawahar has promised to close in half an hour if the information is provided by the beltshops anywhere in the state.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి