మందు బాబులకు కిక్కిచ్చే నిర్ణయం - మద్యం దుకాణాల తరహాలో, కొత్తగా ఇక..!!
ఏపీలో మద్యం అమ్మకాల పైన ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయాలకు సిద్దం అవుతోంది. కొత్త లిక్కర్ పాలసీ అమలు ద్వారా ఆదాయం పెరిగింది. ఇదే సమయంలో రూ 99 క్వార్టర్ అమ్మకాల పెరుగు దల భారీగా కనిపిస్తోంది. మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్స్ అనుమతుల పైన ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక, ఇప్పుడు కొత్త బార్ల పాలసీ పైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. మద్యం పాలసీ తరహాలోనే తీసుకొస్తున్న ఈ పాలసీ మందు బాబులకు కోరుకున్న విధంగా సిద్దం చేస్తున్నారు.
తుది రూపు
ఏపీలో కొత్త బార్ల పాలసీకి తుది రూపు సిద్దం అవుతోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం అయినట్లు తెలుస్తోంది. మద్యం షాపుల తరహాలోనే బార్లకు కూడా లాటరీ విధానంలోనే లైసెన్స్‌లు ఇవ్వాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. జగన్ హయాంలో వేలం విధానంలో బార్లకు లైసెన్స్‌లు కేటాయించారు. అయితే ప్రస్తుత బార్లకు యథావిధిగా లైసెన్స్‌లు పొడిగించి.. కొత్త వాటికి మాత్రం లాటరీ నిర్వహించాలని వ్యాపారులు కోరినా.. మొత్తం బార్లకు కొత్తగానే లైసెన్స్‌లు జారీచేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. లైసెన్స్ ఫీజుల విషయంలో రెండు రకాల ప్రతిపాదనలు చేశారు. నగర పంచాయతీ బార్లకు రూ.35 లక్షలు, మున్సిపాలిటీల్లోని బార్లకు రూ.40 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లలోని బార్లకు రూ.45 లక్షలు లైసెన్స్ ఫీజులుగా పెట్టాలన్నది మొదటి ప్రతిపాదనగా ఉంది.

తాజా ప్రతిపాదనలు
అదే విధంగా రెండో ప్రతిపాదనలో నగర పంచాయతీల్లోని బార్లకు రూ.55లక్షలు, మున్సిపాలిటీ ల్లోని బార్లకు రూ.65లక్షలు, కార్పొరేషన్లలోని బార్లకు రూ.75 లక్షలుగా ఉండనుంది. కాగా, మొదటి ప్రతిపాదన వల్ల ప్రభుత్వానికి రాబడి తగ్గుతుంది. దానిని భర్తీ చేసేందుకు బార్ల సంఖ్య పెంచాలని భావిస్తున్నారు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉండగా ఆ సంఖ్యను వెయ్యికి పైగా పెంచాలనే ఆలోచన ఉంది. ఒకవేళ రెండో ప్రతిపాదన ప్రకారం ఫీజులు ఎక్కువగా ఉంటే బార్ల సంఖ్య యథావిధిగా కొనసాగుతుంది. అయితే ఫీజులు తగ్గించి, బార్ల సంఖ్య పెంచడానికే ఎక్కువ అవకాశం ఉందని సమాచారం. అలాగే బార్లకు ఇచ్చే ధరను కూడా మద్యం దుకాణాలతో సమానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
కీలక మార్పులు
మద్యం షాపులు, బార్లు ప్రభుత్వం నుంచి మద్యం కొనుగోలు చేస్తాయి. అయితే షాపులతో పోలిస్తే బార్లు 10 శాతం అదనంగా ధర చెల్లిస్తాయి. దానిని తగ్గించడం వల్ల ఏడాదికి దాదాపు రూ.300 కోట్లు నష్టపోవలసి వస్తుందని అంచనా. దానిని లైసెన్స్ ఫీజుల రూపంలో అదనంగా రాబట్టే లో కార్యాచరణ సిద్దం చేస్తోంది. అలాగే దరఖాస్తు రుసుమును రూ.5 లక్షలుగా నిర్ణయించింది. మొత్తం పాలసీపై ఒకట్రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుని ఈ నెల 15లోగా కొత్త పాలసీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత బార్ పాలసీ గడువు నెలాఖరుతో ముగియనుంది. దీంతో, ఆదాయం పెంచుకోవటం లక్ష్యంగా కొత్త పాలసీకి తుది రూపు ఇస్తున్నారు.
-
LPG: ఏపీలో గ్యాస్ పరిస్ధితి ఇదీ- తేల్చేసిన చంద్రబాబు..! -
రైతుబజార్ కూరలు ఇక ఇంటికే, ఇలా చేస్తే చాలు- అక్కడి ధరలకే అన్ని ఉత్పత్తులు..!! -
కొత్త ఇళ్ల పై ప్రభుత్వం గుడ్ న్యూస్- అర్హుల జాబితా సిద్దం, పంపిణీ ఇలా..!! -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఏపీకి ఈ బెనిఫిట్.. ఫోకస్ చెయ్యమన్న సీఎం చంద్రబాబు -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications