మందుబాబుల కోసం ఇక మినీ బార్లు - కండీషన్స్ అప్లై..!!

ఏపీలో లిక్కర్ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరు వాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. ప్రయివేటు వ్యక్తులకే మద్యం దుకాణాలు అప్పగించింది. ఇదే సమయంలో రూ 99 క్వార్టర్ మద్యం కు డిమాండ్ పెరిగింది. ఈ సమయంలోనే కొత్త బార్ల పాలసీ పైన ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. కాగా, మద్యం దుకాణాల వద్దే మందుబాబులు లిక్కర్ తీసుకొని.. అక్కడే ఉండటం సమస్యగా మారుతోంది. దీంతో.. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు సమర్పించింది. పర్మిట్ రూమ్స్ కు అనుమతి ఇవ్వాలని కోరింది.

షాపుల వద్దే తాగుతూ
మద్యం దుకాణాల వద్దే మందుబాబులు నిలబడి సేవిస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా మద్యం అమ్మకాల పైన ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం మద్యం దుకాణాల వద్ద తాగేందుకు అనుమతి ఇవ్వద్దని సిఫార్సు చేసింది. అయితే, మందుబాబులు మాత్రం దుకాణాల వద్దే రోడ్ల మీద మద్యం తీసుకుంటున్నారు. దీంతో, ఇప్పుడు ఎక్సైజ్ శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. గతంలో మద్యం షాపులకు అనుబంధంగా నిలబడి మాత్రమే తాగేందుకు వీలుగా ఏర్పాటుచేసే పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇవ్వొద్దని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. కాగా, ఇప్పుడు దాని వల్ల తలెత్తే ఇబ్బందులను వివరించడం లో ఎక్సైజ్‌ అధికారులు విఫలమయ్యారు. పర్మిట్‌ రూమ్‌ల రద్దు నిర్ణయం వల్ల ప్రభుత్వం రూ.175 కోట్ల ఆదాయం కోల్పోయిన విషయాన్ని వివరిస్తున్నారు.

excise-officials-latest-proposals-on-liquor-sales-to-the-govt

పర్మిట్ రూమ్స్ కోసం
మద్యం దుకాణాల వద్ద పర్మిట్‌ రూమ్‌ లేకపోయినా సరే మందుబాబులు సీసాలు కొనుక్కుని షాపుల దగ్గరే తాగుతున్నారు. దీంతో మళ్లీ పర్మిట్‌ రూమ్‌లు పెట్టాలని ఎక్సైజ్‌ శాఖ ఆలోచన చేస్తోంది. తాజాగా తిరుపతిలో జరిగిన ఎక్సైజ్‌ సమీక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇవ్వడమే మంచిదని, దానివల్ల బహిరంగ ప్రదేశాల్లో తాగుడు గోల పోతుందని ఎక్కువ మంది అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో దీనిపై ఓ కమిటీ వేయాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది. దీని ద్వారా షాపు ముందు, రోడ్లపై తాగకుండా ఎక్సైజ్‌ శాఖ పర్మిట్‌ రూమ్‌లకు అనుమతిస్తుంది. షాపు లైసెన్సీ అక్కడే ఒక చిన్న రూమ్‌ ఏర్పాటుచేసి తాగేందుకు అవకాశం కల్పిస్తారు. అందుకోసం లైసెన్సీ ఏడాదికి రూ.5లక్షలు ఎక్సైజ్‌ శాఖకు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Take a Poll

ఆమోదిస్తారా
గతేడాది అక్టోబరులో 3,396 షాపులకు లైసెన్స్‌లు జారీచేశారు. ఆ తర్వాత గీత కులాలవారికి 340 షాపులు ఇచ్చారు. మొత్తంగా 3,500 షాపుల లైసెన్సీలు రూ.5లక్షల చొప్పున చెల్లించినా రూ.175 కోట్ల ఆదాయం వచ్చేది. గతంలో మద్యం షాపుల వద్ద పర్మిట్‌ రూమ్‌లకు అవకాశం ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. పర్మిట్‌ రూమ్‌లకు అవకాశం ఇస్తే మద్యం షాపులు మినీ బార్లుగా మారతాయని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. పర్మిట్‌ రూమ్‌లకు అవకాశం ఇవ్వకపోతే వస్తున్న ఇబ్బందులను అధికారులు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వనున్నారు. దీంతో, ప్రభుత్వం నుంచి ఈ ప్రతిపాదన పైన ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+