వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ కంపెనీ చేతికొచ్చాక వేగంగా పనులు, ప్యాకేజీపై సంతృప్తి: పోలవరంపై 'ఎక్స్‌పర్ట్'

|
Google Oneindia TeluguNews

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి చాలా బాగుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు నివేదిక పూర్తయింది. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు వేగవంతమయ్యాయని ఆ నివేదికలో పేర్కొంది. ట్రాన్స్‌ట్రాయ్ స్థానంలో పనులు చేపట్టిన నవయుగ సంస్థ వేగంగా పనులు చేస్తోందని పేర్కొన్నారు.

Recommended Video

కేంద్రం పై సిబిఐ విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ !

ఏపీ ప్రభుత్వం కూల్చివేత.. రేపు పార్లమెంటులో ఇలా: శివాజీ మరో షాక్, పార్టీ పేరు చెప్పిన మహేష్ కత్తిఏపీ ప్రభుత్వం కూల్చివేత.. రేపు పార్లమెంటులో ఇలా: శివాజీ మరో షాక్, పార్టీ పేరు చెప్పిన మహేష్ కత్తి

స్పిల్ వే కాంక్రీట్ పనులు 17 వందల నుంచి 3000 క్యూబిక్ మీటర్లకు చేరాయని తెలిపింది. రోజుకు ఆరువేల క్యూబిక్ మీటర్ల పనులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 74 శాతం డయా ఫ్రంవాల్, కాపర్ డ్యాం పనుల్లో పురోగతి ఉందని తెలిపింది. ఆర్ ఆర్ పనులు, అందిన ప్యాకేజీపై ప్రజల నుంచి సానుకూలత ఉందని తెలిపింది.

పోలవరంపై మసూద్ కమిటీ

పోలవరంపై మసూద్ కమిటీ

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖ మసూద్ కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. నవయుగ కంపెనీ లక్ష్యాన్ని చేరుకుంటోందని ఆశాభావం వ్యక్తం చేసింది. పోలవరం పనులు, పునరావాసంపై ఈ కమిటీ ఏర్పాటయింది. దీనిని ప్రభుత్వానికి ఇవ్వనుంది.

 ప్రాజెక్టు ఖర్చు అంచనా ఇది

ప్రాజెక్టు ఖర్చు అంచనా ఇది

పోలవరం ప్రాజెక్టుపై బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పోలవరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తున్నారని టీడీపీ, ప్రాజెక్టు పనుల్లో వేగం లేదని విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఎక్స్‌పర్ట్ కమిటీ నివేదిక ఆసక్తికరం. పోలవరం ప్రాజెక్టుకు రూ.58,319 కోట్లు అవుతాయని గత ఏడాది అంచనా అని చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పటి వరకు దీని కోసం ఆంధ్రప్రదేశ్ రూ.13,201 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. ఈ నిధులను కేంద్రం విడతలవారీగా ఇస్తోంది.

ఏపీ ఖర్చు.. కేంద్రం నిధులు

ఏపీ ఖర్చు.. కేంద్రం నిధులు

పోలవరం ప్రాజెక్టుకు రూ.13000 కోట్లు ఖర్చు చేసినట్లు చంద్రబాబు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సహకరిస్తామని చెప్పిన కేంద్రం తాజాగా, గురువారం కూడా కొన్ని నిధులు విడుదల చేసింది. రూ.1400 కోట్లు ఇస్తామని మూడు రోజుల చెప్పింది. రూ.1098 కోట్లను విడుదల చేసింది. మిగతా రూ.302 కోట్లు త్వరలో విడుదల కానున్నాయి.

 జనసేన, వైసీపీల పైన కూడా ఆరోపణలు

జనసేన, వైసీపీల పైన కూడా ఆరోపణలు

పోలవరం ప్రాజెక్టు విషయంలోను ఏపీ బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని కూడా చంద్రబాబు ఆరోపించారు. జనసేన, వైసీపీలు కూడా ఆరోపణలు చేసి ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు.

English summary
Expert Panel report on Polavaram works developments. The panel said good developments in Project after Navayuga contract.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X