పోలీసులే షాకయ్యారు: పిన్నితో అక్రమ సంబంధం, ప్రశ్నించినందుకు భర్త హత్య

విశాఖపట్నం: మరో దారుణం జరిగింది. సొంత పిన్నితో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడు తనకు అడ్డుగా ఉన్నాడని చిన్నాన్నను హత్య చేశాడు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలసకు చెందిన రాములప్పాడు విశాఖ జిల్లా ఆనందపురం మండలం గొట్టిపల్లిలో హత్యకు గురయ్యాడు.

అతను నాలుగు రోజుల క్రితం అంటే ఈ నెల 13న హత్యకు గురయ్యాడు. మృతుడి సోదరి గౌరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు జరిపారు. ఈ హత్య ఎందుకు జరిగిందో తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

చిన్నాన్నను భయంలో పెట్టాలని

చిన్నాన్నను భయంలో పెట్టాలని

రాములప్పడు తన భార్య నర్సమ్మతో కలిసి గొట్టిపల్లిలోని తన తోడళ్లుడు రమణ ఇంటికి వచ్చాడు. రమణకు అప్పలరాజు, యల్లారావు అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. పిన్ని నర్సమ్మ తన భర్తకు భయం చెప్పాలని అప్పలరాజుకు చెప్పింది. దీంతో చిన్నాన్న రాములప్పడుకు భయం చెప్పాలని సోదరుడు యల్లారావుతో అప్పలరాజు చెప్పాడు.

 మద్యం తాగుదామని తీసుకు వెళ్లి

మద్యం తాగుదామని తీసుకు వెళ్లి

అతడిని సమీపం గ్రామంలోకి మద్యం తాగుదామని తీసుకు వెళ్లారు. అక్కడ మద్యం కొనుగోలు చేసి సాయంత్రం ఐదు గంయల సమయంలో గొట్టిపల్లికి సమీపంలో ఓ మామిడితోటలో రాములప్పడితో మందు తాగించారు. ఆ మైకంలో ఉన్న అతడిని సరుగుడు మోడుతో బాదడంతో మృతి చెందాడు.

జారి చనిపోయాడని నమ్మబలికారు

జారి చనిపోయాడని నమ్మబలికారు

అతడు గెడ్డలో జారి చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. మద్యం మత్తుతో పడిపోయి ఉంటాడని భావించిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉండే ఆర్ఎంపీ డాక్టర్ ఆటోలో తీసుకెళ్లగా మృతి చెందినట్లు చెప్పారు. అతనిని మోదవలసలోని రాములప్పడు ఇంటికి తీసుకెళ్లారు.

 కుటుంబ సభ్యుల అనుమానం

కుటుంబ సభ్యుల అనుమానం

రాములప్పడి బంధువులు అతని మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. మృతికి కారణాలపై ఆరా తీయడం, శరీరంపై స్వల్ప గాయాలు కన్పించడంతో అనుమానంతో ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాఫ్తులో అసలు విషయం వెలుగు చూసింది.

 వరుసకు కొడుకైన వాడితో సంబంధంపై భర్త ప్రశ్న

వరుసకు కొడుకైన వాడితో సంబంధంపై భర్త ప్రశ్న

కొడుకు వరుసైన వ్యక్తితో భార్య సంబంధం పెట్టుకోవడాన్ని భర్త ప్రశ్నించాడు. దీంతో భర్తను తొలగించుకోవాలని నర్సమ్మ కుట్రపన్ని అప్పలరాజుతో హత్యకు ప్రణాళిక రూపొందించింది.

ఈ కేసులో అప్పలరాజు (21), గండిబోయిన యల్లారావు(19), నర్సమ్మ(28)ను పోలీసులు శనివారం భీమిలి కోర్డులో హాజరుపరిచారు. వారిని రిమాండ్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+