అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని హత్య: భార్య పాత్రపై ఆరా
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పట్టపగలు సైకిల్‌పై వెళుతున్న వడ్రంగి మేస్త్రీని కత్తులతో నరికి, చాకులతో పొడిచి చంపిన నలుగురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పట్టపగలు సైకిల్‌పై వెళుతున్న వడ్రంగి మేస్త్రీని కత్తులతో నరికి, చాకులతో పొడిచి చంపిన నలుగురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సోమవారం రాత్రి మీడియా సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు తెలిపారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగినట్లు ఆయన తెలిపారు
లంబాడీపేట ఏసుపాదపురానికి చెందిన వడ్రంగి మేస్త్రీ పొట్నూరి లక్ష్మణరావుకు భార్య నాగమణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లక్ష్మణరావు భార్యతో మరడాని రంగారావు కాలనీకి చెందిన మాకినేడి శ్రీనివాసరావు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై లక్ష్మణరావు శ్రీనివాసరావును మందలించాడు. తన ఇంటికి రావద్దని హెచ్చరించాడు.
తన వివాహేతర సంబంధానికి లక్ష్మణరావు అడ్డుగా ఉన్నాడని, అతడిని తొలగించుకోవాలని శ్రీనివాసరావు నిర్ణయించుకున్నాడు. శ్రీనివాసరావు స్నేహితులైన కత్తేపువీధి గంగానమ్మగుడి ప్రాంతానికి చెందిన గెడ్డం బ్రహ్మానందరావు అలియాస్ డెకాయిటి ఆనంద్ (28), చెంచులకాలనీకి చెందిన బండారు మోహన్ (22), గజ్జెలవారి ప్రాంతానికి చెందిన గోపిశెట్టి మనోజ్‌కుమార్ అలియాస్ పిచ్చి పిల్లి (22)లను సంప్రదించాడు.

ఈ నెల 26న పాతబస్టాండ్ సమీపంలోని బడేటివారి వీధిలో సైకిల్‌పై వెళుతున్న లక్ష్మణరావును కత్తులతో నరికి, చాకులతో పొడిచి హత్య చేశారని డీఎస్పీ వెల్లడించారు. హతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. హంతకులు వన్‌టౌన్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందింది.
సిఐ యు.బంగార్రాజు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు ఎ.దుర్గారావు, ఎస్‌ఎస్‌ఆర్ గంగాధర్, సిబ్బందితో వెళ్ళి అరెస్టు చేశారని చెప్పారు. లక్ష్మణరావు భార్య నాగమణి పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వెంకటేశ్వరరావు చెప్పారు.












Click it and Unblock the Notifications