పిన్నితో ఆక్రమ సంబంధం: ఇద్దరి ప్రాణాలు తీసింది
ఓ అక్రమ సంబంధం వ్యవహారం విషాదాంతమైంది. పైగా వావివరుసలు మరిచి పెట్టుకున్న ఆ సంబంధం చివరికి వారి ప్రాణాలను బలి తీసుకుంది.
శ్రీకాకుళం: ఓ అక్రమ సంబంధం వ్యవహారం విషాదాంతమైంది. పైగా వావివరుసలు మరిచి పెట్టుకున్న ఆ సంబంధం చివరికి వారి ప్రాణాలను బలి తీసుకుంది. దానివల్ల ఇద్దరు పిల్లలు తల్లికి దూరమయ్యారు. తల్లిదండ్రులకు ఓ కొడుకును దూరం చేసింది.
తీవ్ర మనస్తాపానికి గురైన పిన్నికొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారు జామున రైల్వేట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సోమన్నపేటకు చెందిన బూరాడ సీతాలక్ష్మి(32), బూరాడ ధనుంజయ(రాజు)(21) పొందూరు మండలం రైల్వేస్టేషన్‌కు వంద మీటర్ల దూరంలో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. బూరాడ ప్రసాద్‌తో.. రేగిడి మండలం నాయరాలవలస గ్రామానికి చెందిన సీతాలక్ష్మికి 12 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి పది, ఎనిమిదేళ్ల వయసు గల ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇలా సంబంధం
కొంతకాలంగా సీతాలక్ష్మికి తన బావ అయిన బూరాడ భుజంగరావు కుమారుడు ధనుంజయతో వివాహేతర సంబంధం ఉన్నట్టు ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయం తెలియడంతో భర్త ప్రసాద్ తన తల్లి వద్ద పిల్లలను విడిచి పెట్టి.. సీతాలక్ష్మిని కర్ణాటకకు తీసుకెళ్లిపోయాడు. అక్కడ బొంతల పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ధనుంజయ సోమన్నపేటలో ఉంటూ రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

అయినా వదల్లేదు...
గత నెల 28న ధనుంజయ ఇంటిలో నుంచి కొంత బంగారం, దుస్తులు పట్టుకొని ఊరు వదలివెళ్లిపోయాడు. అదేరోజు కర్ణాటకలో ఉంటున్న సీతాలక్ష్మి కూడా అక్కడి నుంచి భర్తకు చెప్పకుండా మాయమైంది. ధనుంజయ, సీతాలక్ష్మి ఇద్దరూ కలిసి వారం రోజుల పాటు పలు చోట్ల తిరిగినట్లు తెలుస్తోంది. మంగళవారం పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైలుపట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం బొబ్బిలి నుంచి ధనుంజయ తన చిన్నాన్న ప్రసాద్ బ్యాంకు ఖాతాకు రూ.15వేలు జమ చేసినట్టు సమాచారం.

రైల్వేస్టేషన్‌కు బారులు తీరిన గ్రామస్థులు
పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరి ఆత్మహత్య విషయం తెలుసుకున్న సోమన్నపేట గ్రామస్థులు మంగళవారం తెల్లవారు జామున ద్విచక్ర వాహనాలు, ఆటోలతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పొందూరు రైల్వేస్టేషన్‌కు సమీపంలో శవాలై కనిపించిన ఇద్దరిని చూసి విషాదంలో మునిగిపోయారు.

సంఘటనకు కొద్దిగంటల ముందు..
ఆత్మహత్యకు పాల్పడడానికి కొన్ని గంటల ముందు సీతాలక్ష్మి కర్ణాటకలో ఉన్న తన భర్త ప్రసాద్‌కు ఫో న్‌చేసి తాను పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, వచ్చి తన శవాన్ని తీసుకుపోవాలని చెప్పింది. అయితే, అటువంటి పని చేసుకోవద్దని, సోమన్నపేట వెళ్లిపోవాలని, తనకూ పిల్లలకూ అన్యాయం చేయవద్దని ప్రసాద్ చెప్పాడని స్థానికులు అంటున్నారు. మృతుడు ధనుంజయ కూడా గ్రామంలో కొంతమంది స్నేహితులకు తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన బ్యాగు ఫలానా దగ్గర ఉందని, తీసుకువెళ్లాలని ఎస్‌ఎం ఎస్‌లు పంపించాడు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications