వివాహేతర సంబంధం: ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదు

హైదరాబాద్: నగరంలోని బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించి గత కొద్ది నెలల కిందట బదిలీపై వెళ్లిన ఆర్‌బి రంగయ్యపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని.. తనను శరీరకంగా హింసించాడని అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలిసింది.

వివరాల్లోకి వెళితే.. ఓల్డ్ బోయిన్‌పల్లి సమతానగర్‌కు చెందిన ఓ వ్యక్తి కుటుంబసభ్యులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌గా గతంలో పని చేసిన రంగయ్య తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని.. తాను ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చిపోయేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు.

Extramarital affair: A case registered on Inspector

తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉండగా మరో ఘటనలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని వూడూరు మండలం చన్ గోముల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న జయవర్ధన్, వెంకటేశం, తుక్క్యానాయక్, జయానందంలను సస్పెండ్ చేస్తూ గ్రామీణ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతికి కారణమైన వాహనాన్ని అదుపులోకి తీసుకుని, అందులోని ఫ్లైవుడ్, ఇతర సామాగ్రిని ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వాహన యజమానికి ఇచ్చినందుకు ఆ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ విధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+