నకిలీ సర్టిఫికెట్స్: రూ. లక్షల్లో... నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు (ఫోటోలు)

విశాఖపట్నం: నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని విశాఖ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివారాలు క్రైం డీసీపీ పి.రవికుమార్ మూర్తి వెల్లడించారు. విశాఖలోని ద్వారకానగర్‌కు చెందిన మామిడి మురళీకృష్ణ (39) ఎంవీపీ కాలనీలో 2012లో 'మామిడి గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ హెచ్‌ఆర్ సొల్యూషన్స్' సంస్ధను ప్రారంభించారు.

దేశంలోని పలు విద్యాలయాలు, విశ్వవిద్యాలయాల సిబ్బందితో సంబంధాలు ఏర్పరచుకుని వాటి పేరిట విద్యార్హత సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్నాడు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, ఎంటెక్, బీఈడీ, ఎంఈడీ, బీఎల్ వంటి కోర్సుల నికలీ సర్టిఫికెట్లను అమ్ముతున్నాడు.

మధురవాడకు చెందిన బుగతా కార్తీక్ రామ్ గాయత్రీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివాడు. ఆయన కొన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కాలేదు. ఎలాగైనా బీటెక్ సర్టిఫికెట్ పొందాలనుకున్న కార్తీక్... మురళీ కృష్ణను కలిశాడు. నకిలీ సర్టిఫికెట్ కోసం రూ. 1,75,000కు వీరి మధ్య బేరం కుదిరింది. కార్తీక్ నుంచి ముందుగా రూ. 1,15, 000లను మురళీ కృష్ణ తీసుకున్నాడు.

అనంతరం నాలుగు నెలల్లో పరీక్షలకు హాజరు కాకుండానే రెండు సెమిస్టర్లలో ఉత్తీర్ణుడైనట్లుగా కార్తీక్‌కు సర్టిఫికెట్ ఇచ్చాడు. మిగిలిన రెండు సెమిస్టర్ల సర్టిఫికెట్స్ ఇవ్వక పోవడంతో కార్తీక్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారించే సరికి ఈ గుట్టు బయట పడింది.

దీంతో ద్వారాకనగర్‌లోని మురళీకృష్ణ కార్యాలయాన్ని పోలీసులు సోదా చేసి వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 49 సర్టిఫికెట్లు, రూ. 31 వేల నగదు, రెండు ల్యాప్ టాప్‌లు, రబ్బరు స్టాంపులు, పెన్ డ్రైవ్ లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 3 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.

 నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని విశాఖ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివారాలు క్రైం డీసీపీ పి.రవికుమార్ మూర్తి వెల్లడించారు. విశాఖలోని ద్వారకానగర్‌కు చెందిన మామిడి మురళీకృష్ణ (39) ఎంవీపీ కాలనీలో 2012లో 'మామిడి గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ హెచ్‌ఆర్ సొల్యూషన్స్' సంస్ధను ప్రారంభించారు.

 నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

దేశంలోని పలు విద్యాలయాలు, విశ్వవిద్యాలయాల సిబ్బందితో సంబంధాలు ఏర్పరచుకుని వాటి పేరిట విద్యార్హత సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్నాడు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, ఎంటెక్, బీఈడీ, ఎంఈడీ, బీఎల్ వంటి కోర్సుల నికలీ సర్టిఫికెట్లను అమ్ముతున్నాడు.

 నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

మధురవాడకు చెందిన బుగతా కార్తీక్ రామ్ గాయత్రీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివాడు. ఆయన కొన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కాలేదు. ఎలాగైనా బీటెక్ సర్టిఫికెట్ పొందాలనుకున్న కార్తీక్... మురళీ కృష్ణను కలిశాడు. నకిలీ సర్టిఫికెట్ కోసం రూ. 1,75,000కు వీరి మధ్య బేరం కుదిరింది. కార్తీక్ నుంచి ముందుగా రూ. 1,15, 000లను మురళీ కృష్ణ తీసుకున్నాడు.

 నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

అనంతరం నాలుగు నెలల్లో పరీక్షలకు హాజరు కాకుండానే రెండు సెమిస్టర్లలో ఉత్తీర్ణుడైనట్లుగా కార్తీక్‌కు సర్టిఫికెట్ ఇచ్చాడు. మిగిలిన రెండు సెమిస్టర్ల సర్టిఫికెట్స్ ఇవ్వక పోవడంతో కార్తీక్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారించే సరికి ఈ గుట్టు బయట పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+