'అనంత'లో దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు: 9 మంది అరెస్ట్
హైదరాబాద్: అనంతపురంలో దొంగనోట్లు చెలామణీ చేస్తున్న ముఠాను 3వ పట్టణ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 40 వేల కరెన్సీ, రూ.5 లక్షల నకిలీ కరెన్సీ, ఒక కంప్యూటర్, ప్రింటర్‌తో పాటు మరో 12 రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ వ్యక్తి నకిలీ కరెన్సీని మారుస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది.

తెర్లాంలో ఇరువర్గాల ఘర్షణ
విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందిగాం యాదవవీధిలో బుధవారం ఉదయం ఇరు వర్గాల ఘర్షణలో 20 మందికి గాయలయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గతేడాది యాదవ వీధిలో జరిగిన చిన్న ఘర్షణ కారణంగా బుధవారం మాటామాటా పెరిగి ఈ ఘర్షణకు దారి తీసినట్లు తెలుస్తోంది.
ఈ ఘర్షణలో పిన్నింటి సత్యం వర్గానికి చెందిన 13 మందికి, సూరి వర్గానికి చెందిన 7 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం బాడంగి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కూలీల వాహనం బోల్తాపడి ఒకరు మృతి
వరికుంటపాడు మండలం జరదేవి దగ్గర కూలీల వాహనం బోల్తాపడి ఒకరు మరణించగా పదిమంది కూలీలు గాయపడ్డారు. గాయపడిన వారు పామూరు వాసులుగా గుర్తించారు. గాయపడిన వారికి సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications