కుటుంబాన్ని మింగిన అప్పులు: పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య
చిత్తూరు: అప్పులవాళ్ల వేధింపులు తాళలేక ఓ కుటుంబానికి చెందినవారంతా ప్రాణాలు తీసుకున్నారు. భార్యాభర్తలు వారి పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా సదుం మండల కేంద్రంలోని సీతమ్మ చెరువు వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఐరాల మండలం దిగువనాగులవారిపల్లెకు చెందిన శివశంకర్ (32), లీలావతి (31) దంపతులు పదేళ్ల లోపు కూతురిని, కుమారుడిని తీసుకుని గురువారం ఉదయం బైక్‌పై సదుం గ్రామ సమీపంలోని సీతమ్మ చెరువు వద్దకు చేరుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

సాయంత్రానికి మృతదేహాలు చెరువులో తేలియాడుతూ కనిపించాయి. స్థానికులు గుర్తించి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. శివశంకర్ వద్ద లభించిన లేఖను బట్టి అప్పులవారి వేధింపులే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.
పాకాల, దామలచెరువు గ్రామాలకు చెందిన జ్యోతీశ్వర్ నాయుడు, రామచంద్ర, సుబ్రహ్మణ్యం, నరేంద్ర నాయుడు, సీతారామయ్యల వేధింపులు భరించలేకనే తాము ఈ చర్యకు పాల్పడుతున్నట్లు శివశంకర్ ఆ లేఖలో రాశాడు. అవసరాల కోసం వారి వద్ద అప్పు తీసుకోవడమే తను చేసిన పెద్ద తప్పుగా మారిందని అందులో రాసి ఉంది.












Click it and Unblock the Notifications