పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన ప్రభాస్, అల్లు అర్జున్ అభిమానులు

ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం మొదలుకానుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా ఎన్నికల కురుక్షేత్రానికి సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉంటే తెలుగు హీరోల అభిమానులందరూ తనకు మద్దతివ్వాలని గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. హీరోలందరూ తనతో బాగుంటారని.. నాతో ఏ హీరోకు విభేదాల్లేవని మీరంతా వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని అభిమానులను పవన్ కల్యాణ్ వేడుకున్నారు.

అయితే కొందరు హీరోల అభిమానులు పవన్ కల్యాణ్‌కు షాకిచ్చారు. తాజాగా ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైసీపీలో చేరారు. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి చిన్నియాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అభిమానులు మంత్రి అమర్‌నాథ్ నివాసంలో వైసీపీలో చేరారు. మెగా అభిమానులు సాధారణంగానే పవన్ పార్టీకి అండగా ఉంటున్నారు. కానీ తాజాగా అల్లు అర్జున్ అభిమానులు వైసీపీలో చేరి జగన్‌కు మద్దతుగా నిలిచారు.ఇక ప్రభాస్ అభిమానులు సైతం భారీ సంఖ్యలో వైసీపీలో చేరారు.

Fans of Prabhas and Allu Arjun joined YCP

ప్రభాస్ పెద్దనాన్న దివంగత నటుడు కృష్ణంరాజు బీజేపీలో కొనసాగారు. దీంతో ప్రభాస్ అభిమానులు కూటమికి అండగా నిలుస్తారని అంతా భావించారు. కానీ కూటమి నేతలకు షాకిస్తూ.. అభిమానులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తమ మద్దతు సీఎం జగన్‌కు ఇస్తున్నామని ప్రకటించారు. జగన్ ఆధ్వర్యంలో గాజువాక అభివృద్ధి చెందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+