గుంటూరు గ్రీవిన్స్‌లో కలెక్టర్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
గుంటూరు: గుంటూరు జిల్లా లో రైతులు వరుస ఆత్మహత్యల చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత వారం ఓ రైతు ఇదే విధముగా ఆత్మహత్యా ప్రయత్నం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
తాజా గా గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం బుక్కా పురం కు చెందిన ప్రసన్నబాబు అనే రైతు నేడు జరుగుతున్న గ్రీవిన్స్ సెల్ లో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసాడు.

వెంటనే స్థానికులు గమనించి అతన్ని అడ్డుకున్నారు. డిగ్రీ చదువుకుని 10 ఏళ్ళు గా వ్యవసాయం చేస్తున్నానని,ఏటా వేసిన పంటల్లో ఎదో విధంగా నష్టం రావటం తో ఇప్పటికి 8 లక్షలు బాకీల పాలయ్యానని చేసేది లేక అధికారులు కి ఎన్ని సార్లు మొరపెట్టినా ఉపయోగం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
నాలుగు నెలల క్రితం సీఎం ని కలిస్తే 25 వేలు ఆర్ధిక సాయం ఆందించగా డైరీ ఫారం పెట్టుకునేందుకు సీఎం అధికారులు ఆదేశాలు జారీ చేస్తే ఒక్క అధికారి పట్టించు కోలేదని అందుకే ఆత్మహత్య యత్నం చేశానని ప్రసన్నబాబు అంటున్నాడు.












Click it and Unblock the Notifications