ఒక టమాటా.. జీవితాన్నే మార్చింది.. రూ.కోట్లు కురిపించింది!
దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. కేజీ రూ.130 నుంచి రూ.150 చొప్పున అన్ని రాష్ట్రాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యం ఒక రైతుకు కలిసి వచ్చింది. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో టమోటా సాగు చేసిన ఓ రైతుకు జాక్‌పాట్ తగిలింది. తుకారాం భాగోజీ గయాకర్, అతని కుటుంబం నెలలో 13,000 టమాటా బాక్సులను (ఒక్కో బాక్సు 20 కేజీలు) విక్రయించడం ద్వారా రూ. 1.5 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించారు.
తుకారాంకు 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 12 ఎకరాల భూమిలో కుమారుడు ఈశ్వర్ గయాకర్, కోడలు సోనాలి సహకారంతో టమాట వేశాడు. కొడుకు, కోడలికి ఎరువులు, పురుగు మందులపై అవగాహన ఉండటంతో పంట తెగుళ్ల నుంచి టమాటాను సురక్షితంగా ఉంచారు. నారాయణ గంజ్ లో ఒక టమాటా బాక్సును అమ్మితే ఒక్కరోజులో రూ.2100 వస్తుంది. గయాకర్ మొత్తం 900 బాక్సులను అమ్మి రూ.18 లక్షలు సంపాదించారు.

డబ్బాలో ఉండే సరుకు నాణ్యత ఆధారంగా ఒక్కో బాక్సును రూ.1000 నుంచి 2,400 వరకు విక్రయించగలిగాడు. గయాకర్ ఒక్కడే కాదు.. పుణె జిల్లాలోని జున్నార్‌లో టమాటాలు పండిస్తున్న చాలా మంది రైతులు ఇప్పుడు కోటీశ్వరులుగా మారారు. ఈ కమిటీ టమాటా విక్రయం ద్వారా నెల రోజుల్లో రూ.80 కోట్ల వ్యాపారం చేసింది. దీనిద్వారా ఆ ప్రాంతంలో 100 మందికి పైగా మహిళలకు ఉపాధి లభించింది. తుకారాం కొడుకు ఈశ్వర్ సేల్స్, మెయింట్ నెన్స్, ఫైనాన్స్ ప్లానింగ్ చూసేవాడు. కోడలు మొక్కలు నాటడం, పంట కోయడం, ప్యాకేజింగ్ లాంటి పనులు చూసేది. మార్కెట్ లోధరలు విపరీతంగా పెరగడంతో మూడు నెలల వీరి శ్రమకు తగ్గ ఫలితం కనబడింది.
పచ్ఘర్ పూణే జిల్లా సరిహద్దులో ఉన్న ఒక చిన్న గ్రామం. జున్నార్‌ను గ్రీన్ బెల్ట్ అని అంటారు. రాష్ట్రంలోని చాలా ఆనకట్టలు ఈ ప్రాంతం పరిధిలో ఉన్నాయి. సంవత్సరం పొడవునా నల్ల నేల, నీటి వసతి కారణంగా ఉల్లి, టమాటా సాగుచేస్తారు. తుకారం గయాకర్ ఒక్కడే కాకుండా మరో 12 మంది రైతులు కూడా లక్షాధికారులుగా మారారు.












Click it and Unblock the Notifications