చంద్రబాబును మెచ్చుకున్న 'రాజధాని' రైతులు, జగన్ పైన ఆగ్రహం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాజధాని అమరావతి ప్రాంత రైతులు సోమవారం ఉదయం కలిశారు. చంద్రబాబును వారు విజయవాడలో కలిసి అభినందించారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారని కితాబిచ్చారు.
రాజధాని నిర్మాణంలో స్థానిక రైతులు, యువకులకు ఉపాధి కల్పించాలని వారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారితో మాట్లాడుతూ... రాజధానిని త్వరగా పూర్తి చేసుకుందామని చెప్పారు. అమరావతి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకుందామన్నారు.
అదే సమయంలో రాజధాని ప్రాంతంలో పంటలు తగులబెట్టడం పైన కూడా చంద్రబాబు స్పందించారు. పంటలను తగులబెట్టే సంస్కృతి తమది కాదన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతులు అందరూ భూములు ఇచ్చారన్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ పైన పరోక్షంగా మండిపడ్డారు.

ఏపీలో జిల్లాలకు టిడిపి ఇంఛార్జుల నియామకం
ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలకు తెలుగుదేశం పార్టీ ఇంఛార్జులను నియమించింది. కడప, అనంతపురం - జయనాగేశ్వర రెడ్డి, చిత్తూరు, కర్నూలు - వర్ల రామయ్య, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి- రెడ్డి సుబ్రహ్మణ్యం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు - బుచ్చయ్య చౌదరి, విశాఖ, తూర్పు గోదావరి, కృష్ణా - రామానాయుడు.
తుంగభద్రలో నీటివాటాకై చంద్రబాబుతో చర్చిస్తాం: శిల్పా
తుంగభద్రలో నీటి వాటా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. కెసి కెనాల్‌కు త్వరలోనే 300 క్యూసెక్కుల నీరు విడుదల చేయనున్నట్లు చెప్పారు. టిఎన్ఎస్ఎఫ్‌లో నేర చరిత్ర కలిగిన వారిపై విచారణ జరిపిస్తామన్నారు.












Click it and Unblock the Notifications