రూ 3.32 లక్షల కోట్ల బడ్జెట్, కొత్త వరాలు - కేటాయింపులు..!!

ఏపీ ప్రభుత్వం భారీ అంచనాలతో 2026-27 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వం లో సాగిన పాలన పైన విమర్శలు చేసారు. రాష్ట్ర విభజన ఒక నష్టం అయితే... ఆ తరువాత అయిదేళ్లు పాలన రాష్ట్రానికి నష్టం చేసిందని ఆరోపించారు. ఈ బడ్జెట్ కేవలం పద్దులే కాదని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని వెల్లడించారు. అభివృద్ధి- సంక్షేమంతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలనేదే తమ విధానమని స్పష్టం చేసారు.

రాష్ట్ర బడ్జెట్ 2026-27 ను ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. రానున్న ఆర్దిక సంవత్సరానికి రూ 3,32,205 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం తో ఈ బడ్జెట్ ప్రతిపాదించినట్లు వెల్లడించారు. రాయలసీమ రైతుల కలలను సాకారం చేసేలా ప్రాధాన్యత ఇచ్చామన్నారు. పెట్టుబడి దారులకు అనుకూల వాతావరణం కల్పించామని ఆర్దిక మంత్రి వివరించారు. కీలక రంగాలకు కేటాయింపులు భారీగా పెంచారు. రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ. 53,915 కోట్లు గా పేర్కొన్నారు.

Finance Minister Payyavula Kesav submits the 2026-27 budget in the assembly with estimations of Rs 3 32 Lakh cr

రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లు..ద్రవ్య లోటు రూ. 75,868 కోట్లు గా అంచనాల్లో వెల్లడించారు. ఇక, శాఖల వారీగా.. వ్యవసాయ శాఖ కు రూ 11,745 కోట్లు, పాఠశాల విద్య కు రూ 32, 208, బీసీ సంక్షేమం రూ 23650 కోట్లు, ఇంధన శాఖ- 19,306 కోట్లు, పంచాయితీ రాజ్ కు రూ 22,941 కోట్లు, ఇరిగేషన్ 18,223 కోట్ల మేర కేటాయింపులు ప్రతిపాదించారు. అన్నదాత సుఖీభవ కోసం రూ 6,600 కోట్లు, మత్స్యకార సేవకు 600 కోట్లు, ధరల స్థిరీకరణ కు రూ 560 కోట్లు కేటాయింపులు చేసారు.

మౌలిక వసతులకు ప్రాధాన్యత

విద్య, వైద్యం, మౌలిక వసతులకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. తల్లికి వందనం కోసం రూ 9,600 కోట్లు ప్రతిపాదించారు. విద్యా మిత్ర కోసం రూ 654 కోట్లు కేటాయించారు. పోలవరం కోసం రూ 6,105 కోట్లు ప్రతిపాదన చేసారు. మున్సిపల్ శాఖకు 14,358 కోట్లు, EWS సంక్షేమం కోసం 10,699 కోట్లు అమరావతి కోసం ఆరు వేల కోట్లు, ఉన్నత విద్య కోసం రూ 2,566 కోట్లు, మహిళా శిశు సంక్షేమం కోసం రూ 4,581 కోట్లు ప్రతిపాదించారు.

మన బడి- మన భవిష్యత్ కోసం రూ 155 కోట్లు ప్రతిపాదించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ 2,161 కోట్లు కేటాయించారు. స్కిల్ డెవలప్ మెంట్ కోసం రూ 1,232 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖకు రూ 11, 118 కోట్లు, స్కాలర్ షిప్ కోసం రూ 3,836 కోట్లు ప్రతిపాదించారు. రూ 30 వేల కోట్లతో హార్టీకల్చర్ క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+