నేడు ఏపీకి హజ్ యాత్రికుల రిటర్న్-డిప్యూటీ సీఎంను పంపిన జగన్..
ఏపీ నుంచి ఈసారి భారీ ఎత్తున ముస్లిం సోదరులు పవిత్ర హజ్ యాత్రకు వెళ్లారు. ఈద్ ముగియడంతో వారంతా ఇప్పుడు తిరుగుముఖం పడుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి వెళ్లిన 170 మంది హజ్ యాత్రికులు ఇవాళ రాత్రికి ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి స్వస్ధలాలకు బయలుదేరి వెళతారు. ఈసారి హజ్ యాత్రకు కేంద్రం పలుమార్పులు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం చేసి మరీ వీరిని హజ్ కు పంపింది.
ఆoధ్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటి ద్వారా హజ్ యాత్రకు వెళ్లి యాత్రను అల్లహ్ దయవల్ల విజయవంతంగా పూర్తి చేసుకుని ఈరొజు స్వదేశానికి వస్తున్నారని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ నుంచి ఇలా హజ్ యాత్రకు వెళ్లిన వారి తొలి విమానం ఇవాళ రిటర్న్ కానుంది. రాత్రి 8 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ విమానం రానుంది. ఇందులో 170 మంది యాత్రికులు ఉన్నారు.

ఎస్జీ 5017 నంబరు విమానం పవిత్ర మదీనా నగరం నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈరొజు చేరుకుటుంది. ఈ విమానంలో వస్తున్న హాజీలకు స్వాగతం పలికేందుకు సీఎం జగన్ తన డిప్యూటీ సీఎం, మైనార్టీ మంత్రి అంజాద్ బాషాను పంపారు. ఆయనతో పాటు మైనార్టీ వ్యవహారాలశాఖ కార్యదర్శి ఇంతియాజ్ కూడా వెళ్తున్నారు.
రాత్రి 7.45కు ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న వీరిద్దరూ 8 గంటలకు హజ్ యాత్రికుల్ని రిసీవ్ చేసుకుంటారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ ఛైర్మన్ గౌసుల్ ఆజంతో పాటు మైనార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటారు.

ఈ ఏడాది హజ్ యాత్రకు సంబంధించి కేంద్రం పలు మార్పులు చేసింది. ఇందులో భాగంగా విజయవాడ నుంచి వెళ్లే వారికి అదనంగా 80 వేల రూపాయలకు పైగా ఛార్జీలు విధించింది. లేకపోతే హైదరాబాద్ వెళ్లి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్లాల్సిన పరిస్దితి. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ ఈ అదనపు ఛార్జీల్ని భరించి వేల మందిని హజ్ యాత్రకు పంపింది. అంతే కాదు స్దానికంగా విజయవాడ, గుంటూరుల్లో భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసింది. ఇప్పుడు వారిని రిసీవ్ చేసుకునే విషయంలోనూ అంతే భారీగా ఏర్పాట్లు చేస్తోంది.












Click it and Unblock the Notifications