ఎంపిటిసి, జెడ్పీటిసి పోలింగ్: పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు
హైదరాబాద్: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల తొలి దశ పోలింగులో స్వల్ప ఉద్రిక్త సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 557 జెడ్పీటిసి, 8,250 ఎంపిటిసి స్థానాలకు పోలింగ్ జరిగింది. ఐదు గంటలకు పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా ఉద్రిక్తత తలెత్తింది.
గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం కొత్తపాలెంలో టిడిపి, జగన్ పార్టీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం అంబడిపూడిలో పోలింగ్ కేంద్రం ఎదురుగా వేసిన టెంట్లను తీయాలంటూ పోలీసులు ఆదేశించారు. సిఐ ముగ్గురిపై లాఠీఛార్జ్ చేశారు. స్థానికులు ఆందోళనకు దిగారు.

కడప జిల్లా రాయచోటి మండలంలో పోలింగ్ కేంద్రం వద్ద జగన్ పార్టీ, టిడిపి కార్యకర్తల మధ్చయ తోపులాట జరిగంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలో జగన్ పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీ కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
కడప జిల్లాలోని ఖాజీపేటలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఆదివారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు మైదుకూరు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలవద్ద జగన్ పార్టీ, టిడిపి వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications