Jogi Ramesh జోగి రమేశ్ ఇంటికి నిప్పు..! అంబటి ఘటన జరిగి 24 గంటల్లోనే..!
ఏపీలో తిరుమల లడ్డూ నెయ్యిపై సిట్ రిపోర్ట్ తర్వాత కూటమి ప్రభుత్వం, వైఎస్సార్సీపీ మధ్య సాగుతున్న రాజకీయం పతాకస్థాయికి చేరుకుంది. ఇందులో భాగంగా నిన్న సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన టీడీపీ క్యాడర్.. ఇవాళ మంత్రి లోకేష్ పై విమర్శలకు దిగిన మరో మాజీ మంత్రి జోగి రమేశ్ (jogi ramesh) ఇంటిపై దాడికి దిగింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
జోగి రమేష్ ఇంటికి నిప్పు (jogi ramesh)
నిన్న మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు చిప్ దొ..బి అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు టీడీపీకి మంటపుట్టించాయి. దీంతో ఇవాళ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిని వందలాది మంది టీడీపీ అనుచరులు ధ్వంసం చేసి నిప్పంటించారు. స్ధానిక వర్గాల సమాచారం ప్రకారం జోగి రమేష్ ఇంటిపైకి టీడీపీ కార్యకర్తలు గుంపుగా చొరబడ్డారు.

ఇంట్లోకి దూసుకెళ్లి మరీ..
ఇంటి ఆవరణతో పాటు ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ ఘటన జరుగుతున్న సమయంలో జోగి రమేశ్ కర్నూల్లో ఉన్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్నా పరిస్ధితిని అదుపు చేయడంలో విఫలమయ్యారు. దీంతో టీడీపీ కార్యకర్తలు జోగి రమేశ్ ఇంట్లోకి చొచ్చుకుని వెళ్లడంతో పాటు నిప్పు పెట్టే వరకూ వెళ్లారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు వైఎస్సార్సీపీ మాజీ మంత్రుల ఇళ్లకు టీడీపీ క్యాడర్ ధ్వంసం చేయడం, నిప్పు పెట్టడం చేయడంతో ఆ పార్టీ నేతలు రగిలిపోతున్నారు.












Click it and Unblock the Notifications