తారకరత్న వైద్య చికిత్సలో కీలక అప్ డేట్..!!

నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు కీలక అప్ డేట్ ఇచ్చారు. అందుతున్న వైద్యం గురించి కుటుంబ సభ్యులు వివరించారు.

నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు కీలక అప్ డేట్ ఇచ్చారు. కుప్పంలో గత నెల 27న గుండెపోటుకు గురైన తారకరత్న ప్రస్తుతం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన కు కుప్పంలోని ఆస్పత్రిలో ప్రాధమిక చికిత్స చేసిన తరువాత మెరుగైన చికిత్స కోసం బెంగుళూరుకు తరలించారు.

కుప్పంలో తారకరత్న గుండెపోటుకు గురైన సమయం నుంచి నందమూరి బాలకృష్ణ వైద్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ అవసరమైన చికిత్స అందేలా చొరవ తీసుకున్నారు. గుండె సమస్య నుంచి బయట పడిన తారకరత్నకు..ఇప్పుడు మెదడు సంబంధింత చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం..అందుతున్న వైద్యం గురించి కుటుంబ సభ్యులు వివరించారు.

తారకరత్నకు కొనసాగుతున్న చికిత్స

తారకరత్నకు కొనసాగుతున్న చికిత్స

తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కుప్పంలో గుండెపోటుతో కుప్పకూలిన తరువాత ఆయన గుండె పని తీరు పైన తీవ్ర ప్రభావం చూపింది. అయితే, వైద్యుల చికిత్స తరువాత గుండె సంబంధిత సమస్యల నుంచి బయట పడ్డారు. అప్పటికే మెదడుకు సంబంధించి సమస్యలను గుర్తించారు.

కుప్పం నుంచి బెంగుళూరుకు తరలించే సమయంలో కర్ణాటక ప్రభుత్వం తారకరత్న ను అంబులెన్స్ లో తరలించే సమయంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు..నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్..కల్యాణ్ రాం బెంగుళూరు ఆస్పత్రికి వచ్చి తారకరత్నను పరామర్శించారు.

విదేశీ వైద్యులతో ట్రీట్ మెంట్

విదేశీ వైద్యులతో ట్రీట్ మెంట్

జానియర్ ఎన్టీఆర్ ఆస్పత్రికి వచ్చిన సమయంలో కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ కూడా అక్కడకు చేరుకున్నారు. సినీ నటుడు శివరాజ్ కుమార్ ఆస్పత్రికి వచ్చి తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడిన తరువాత మంత్రి విదేశాల నుంచి నిపుణులైన వైద్యులను రప్పిస్తున్నట్లు వెల్లడించారు.

తొలుత మెరుగైన వైద్య చికిత్స కోసం విదేశాలకు తరలిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ, బెంగుళూరు ఆస్పత్రిలోనే విదేశీ వైద్యులతో చికిత్సం అందించేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో..ప్రస్తుతం విదేశీ వైద్యులను రప్పించి చికిత్స కొనసాగిస్తున్నారు. హృద్రోగంతో పాటుగా న్యూరో సమస్యలకు సంబంధించి విదేశీ వైద్యులు తారకరత్నకు చికిత్స అందిస్తున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ప్రత్యేక వైద్యుల టీం పర్యవేక్షణలో

ప్రత్యేక వైద్యుల టీం పర్యవేక్షణలో

తారకరత్నకు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ ప్రత్యేక వైద్యుల టీం చికిత్స అందిస్తోంది. విదేశీ వైద్యులతో పాటుగా ఆస్పత్రికి చెందిన నిపుణుల టీం కలిసి నిరంతరం తారకరత్న వైద్య పరిస్థితిని గమనిస్తోంది. అవసరమూన చికిత్స అందిస్తోంది. వైసీపీ నేత విజయ సాయిరెడ్డి ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించారు.

వైద్య సాయం అందించటంలో బాలకృష్ణ ను అభినందించారు. తరువాత ఇద్దరూ ఫోన్ లో తారకరత్నకు అందించాల్సిన వైద్యం గురించి మాట్లాడుకున్నారు. చంద్రబాబు..బాలకృష్ణ ..జూ ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు ఆస్పత్రి వైద్యులో టచ్ లో ఉంటున్నారు. తారకరత్న ఆరోగ్యం పైన సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. త్వరలోనే తారకరత్న పూర్తిగా కోలుకుంటారని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+