మాజీ జేడీ ఫైనల్ డెసిషన్ : వచ్చే ఎన్నికల్లో పోటీ - పార్టీ పై క్లారిటీ: ఇక తప్పలేదా..!?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సస్పెన్స్ కు తెర దించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని గతంలోనే మాజీ జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. ఏ పార్టీ నుంచి పోటీలో ఉంటారనేదే ఇప్పటి వరకు తేల్చని విషయం. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా లక్ష్మీనారాయణ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి సత్యనారాయణ విశాఖ ఎంపీగా గెలుపొందారు.

ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఏపీ రాజకీయం కొనసాగుతున్న వేళ లక్ష్మీనారాయణ తిరిగి విశాఖ నుంచి బరిలో నిలబడాలని డిసైడ్ అయ్యారు. ఆయన పోటీకి సంబంధించి జేడీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ కీలక ప్రకటన చేసారు.

విశాఖ నుంచే పోటీ .. ముందస్తు ఏర్పాట్లు

విశాఖ నుంచే పోటీ .. ముందస్తు ఏర్పాట్లు

మాజీ జేడీ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో ఓడినా..విశాఖను వీడలేదు. అప్పటి నుంచి తిరిగి విశాఖలోనే పోటీ చేసి తిరిగి గెలవాలనేది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. జేడీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఎక్కువగా విశాఖ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే లక్ష్మీనారాయణదాఖలు చేసిన పిటీషన్ పైన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో ఏపీలో కొత్త పార్టీలు ఎంట్రీ ఇస్తున్న వేళ..జేడీ అందులో కీలక బాధ్యతలు చేపడతారనే ప్రచారం సాగుతోంది. వీటికి ముగింపు ఇచ్చేలా మాజీ జేడీ సన్నిహితులు వెల్లడించారు.

పార్టీలు కాదు.. స్వతంత్రంగానే బరిలోకి

పార్టీలు కాదు.. స్వతంత్రంగానే బరిలోకి

విశాఖ నుంచి పోటీ చేయటం ఖాయం చేసిన మాజీ జేడీ.. ఏ పార్టీ నుంచి పోటీ చేయటం లేదనేది స్పష్టం అవుతోంది. లక్ష్మీనారాయణ తొలి నుంచి భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీలో చేరుతానని చెప్పుకొచ్చారు. జనసేన నుంచి బయటకు వచ్చేయటంతో, ఇప్పుడు టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగింది.

బీజేపీ వైపు చూసినా.. కేంద్ర నిర్ణయాల పైన ఆయన పోరాడుతుండటంతో సాధ్యపడదనేది స్పష్టం అయింది. తాజాగా జేడీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ జగన్ మురారి ఒక ప్రకటన విడుదల చేసారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విశాఖపట్నం లోక్ సభ సభ్యునిగా అది కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. అయితే, ఈ ప్రకటన లక్ష్మీనారాయణ అధికారికంగా కాకుండా ఆయన నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఇది పైనల్ నిర్ణయామా - మార్పు ఉంటుందా

ఇది పైనల్ నిర్ణయామా - మార్పు ఉంటుందా

మాజీ జేడీ లక్ష్మీనారాయణ పైన రాజకీయంగా జరుగుతున్న ప్రచారానికి ముగింపు ఇచ్చేందుకే ఈ ప్రకటన వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లక్ష్మీనారాయణ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలనేది ఫైనల్ నిర్ణయంగా ఉంటుందా..లేక, పార్టీలు ఏవైనా ముందుకొస్తే నిర్ణయంలో మార్పు ఉంటుందా అనేది మరో చర్చ.

ఇండిపెండెంట్ అభ్యర్ధిగా లక్ష్మీనారాయణ బరిలోకి దిగితే హోరా హోరీగా మారుతున్న ఏపీ ఎన్నికలు, అందునా విశాఖ కావటంతో ఆయన పోటీ ఎవరికి కలిసి వస్తుందనేది ఆసక్తి కరమే. జేడీకి పోలయ్యే ఓట్లు ఏ పార్టీకి నష్టం చేస్తాయనేది చూడాల్సి ఉంటుంది.

గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన లక్ష్మీనారాయణకు 2.88 లక్షల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రకటన రావటంతో జేడీ కేంద్రంగా విశాఖ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+