వైఎస్ జగన్ పాలన అంటే ఫ్యాక్షనిస్టు పాలన.. అజ్ఞాతం వీడిన కూన రవి కుమార్
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ కూన రవి కుమార్ అజ్ఞాతం వీడారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తూ, దురుసుగా ప్రవర్తించారన్న వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైంది. గత నెల 26న కూన రవిపై సరబుజ్జిలి పోలీసులకు ఎంపీడీవో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే ఆ మరుసటి రోజు నుంచి కూన రవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో శుక్రవారం అజ్ఞాతం వీడారు. దీంతో ఆయన తమ్మినేని నా టార్గెట్ అంటూ విరుచుకుపడ్డారు.

అధికార పార్టీపై విరుచుకుపడిన కూన రవి కుమార్
శుక్రవారం నాడు శ్రీకాకుళం జిల్లా లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి హాజరైనటువంటి శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్ వైసిపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ నాయకుడు తమ్మినేని సీతారాం పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు . వైసిపి ప్రభుత్వం కావాలనే టిడిపి నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నదంటూ అధికారపార్టీ పైన తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.

తమ్మినేని అరాచకాలు బయట పెడతానాన్న మాజీ చీఫ్ విప్
అంతేకాకుండా అధికార పార్టీ నాయకులు చేసే అవినీతిని బయటపెడతామని కూన రవికుమార్ స్పష్టం చేశారు. అంతేకాదు తన భవిష్యత్ కార్యాచరణ ఒకటే అని తన అజెండా ఒక్కటే అని గట్టిగా చెప్పిన కూన రవికుమార్ ఆముదాలవలస నియోజకవర్గంలో తమ్మినేని సీతారాం చేసే అరాచకాలు, అఘాయిత్యాలు, ఘోరాలు , అవినీతిని నీడలా వెంటాడతా అని తేల్చి చెప్పారు. అంతేకాదు ప్రజలందరి తరపున మాట్లాడే మొదటి గొంతుకను నేనవుతా అని వాఖ్యానించారు.

రాష్ట్రంలో ఫ్యాక్షనిస్ట్ పాలన సాగుతుందన్న టీడీపీ నేత
టిడిపి పార్టీ ని అంతమొందించడానికి వైసిపి పార్టీ నాయకులు తీవ్రంగా కష్టపడుతున్నారు అని చెప్పిన కూన రవికుమార్ ప్రభుత్వం చేసే అవినీతికి సహకరించవద్దని ప్రజల్ని వేడుకుంటున్నా అన్నారు. జగన్ ఒక ఫ్యాక్షనిస్టు అని జగన్ పాలన అంటే ఫ్యాక్షనిస్టు పాలన అని తాము ముందే చెప్పామని ఇప్పుడు అలాంటి పాలనే రాష్ట్రంలో కొనసాగుతుందని ఆయన ఆరోపణలు గుప్పించారు. టిడిపి హయాంలో ఇలాంటి కక్షసాధింపు ధోరణి ఎన్నడూ అవలంబించలేదని కూన రవికుమార్ చెప్పారు.

ఎంత గట్టిగా కింద పడితే అంత గట్టిగా పైకి లేస్తామంటూ హెచ్చరిక
అలా కక్ష సాధిస్తే తమ్మినేని సీతారాం పై ఇప్పటికే 100 కేసులు పెట్టాలని పేర్కొన్నారు. ఇప్పుడు కక్షసాధింపు లో భాగంగానే తనపై కేసులు పెట్టించారని తమ్మినేని పై ఆరోపణలు గుప్పించారు. టిడిపి నేతలు ఎంత గట్టిగా కింద పడితే అంత గట్టిగా పైకి లేస్తామంటూ పేర్కొన్న కూన రవికుమార్ తమ్మినేని అరాచకాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం తన పని అని గట్టిగా చెప్పారు.
టీడీపీ నేతలపై కేసులు పెడితే భయపడి వెనకడుగు వెయ్యరని కచ్చితంగా పోరాటం చేస్తారని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications