జగన్ మోడీని కలిసింది అందుకే-వైఎస్ ఫ్రెండే కానీ అప్పు తీర్చలేదు-చింతా మోహన్ కామెంట్స్..
కర్నూలు : ఏపీలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతల్లో వైఎస్సార్ తో పాటు తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ కూడా ఉన్నారు. అలాగే వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. గతంలో వైఎస్ తో కలిసి రాయలసీమలో రాజకీయాలు చేసిన చింతా మోహన్.. ఆయన మరణం తర్వాత సైలెంట్ గా ఉన్నారు. అయితే వైఎస్ కుమారుడు జగన్ పై మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో వైఎస్ తో తనకున్న అనుబంధాన్ని
చింతా మోహన్ గుర్తు చేసుకున్నారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి తనకు మంచి మిత్రుడన్నారు. కాను ఆయనకు అప్పులు కూడా ఇచ్చినట్లు చింతా మోహన్ తెలిపారు. అయితే వాటిని ఇంతవరకూ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ కంటే ముందే తాను ముఖ్యమంత్రి అవ్వాల్సింది కానీ, కొన్ని కారణాల వల్ల కాలేకపోయానన్నారు. మరోవైపు సీఎం జగన్, ప్రధాని మోడీ భేటీపై చింతా మోహన్ స్పందించారు. సీఎం జగన్ పవర్ డిస్టిబుటరీ సంస్థలో 3600 కోట్లు రిలీజ్ చేయించుకోవడాని మోడీని కలవడానికి ఢిల్లీ వెళ్ళాడన్నారు.

దళితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని కర్నూల్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. కాంగ్రేస్ హయాంలో రేషన్ షాపుల ద్వారా 11రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇచ్చి దళితుల ఆకలి తీర్చేవారని, ప్రస్తుతం రాష్ట్రములో ఆ పరిస్థితి లేదన్నారు. బ్యాంకులు ప్రస్తుతం దళితులకు ఎటువంటి లోన్ లు, సబ్సిడీ లు ఇవ్వడం లేదన్నారు. మహిళలకు సున్నా వడ్డీలు అందించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు విద్యను బోధించాలి కానీ ఏపీలో వారు బాత్రూంలు కడిగే, ఫొటోలు తీసే పనిని ప్రభుత్వం చేయిస్తుందని చింతా మోహన్ విమర్శించారు. 2024లో ఆంధ్రప్రదేశ్, కేంద్రంలోను అధికారం లోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. భారత్ జోడో యాత్రతో దేశంలో మార్పు వచ్చిందని, ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications