అంబటి చిచ్చు..! నాకో న్యాయం, బోండాకో న్యాయమా ? ఏబీవీ ఫైర్..!

ఏపీ రాజకీయాల్లో కులానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎన్నికలప్పుడు మాత్రమే బయటికి కనిపించే కులాలు వాస్తవానికి ఏడాది పొడవునా అవే రాజకీయాల్ని, సాధారణ ప్రజల బతుకుల్నీ శాసిస్తుంటాయి. కులం ముందు రాజకీయ పార్టీలు కానీ, ఇతర సమీకరణాలు కానీ ఏమాత్రం పనికి రావు. ఇప్పుడు అదే కులం మరోసారి బహిరంగ చర్చకు కారణమవుతోంది. ఇందుకు ప్రధాన కేంద్రం వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ మధ్య అంబటి చాలా యాక్టివ్ గా మారిపోయి ప్రతీ చోటా దర్శనమిస్తున్నారు. దీంతో ఇతర విషయాల్లో ఆయనతో విభేదించే వారు కాస్తా, స్టేజ్ పంచుకుంటున్న విషయంలో మాత్రం ఇరుకునపడుతున్నారు.

గతంలో ప్రశ్న రావణ్ పై కూటమి సర్కార్ ఉపా కేసు నమోదు చేసిన విషయంలో సిటిజన్స్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే స్వచ్చంద సంస్థ తరఫున వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పోరాటాలు చేసిన మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరావు (AB Venkateswara Rao) ఇరుకునపడ్డారు. ఒకప్పుడు టీడీపీకి సన్నిహితంగా మెలిగిన ఏబీవీ.. రావణ్ పై ఉపా కేసు తప్పంటూ నోరువిప్పడం ఇందుకు ఓ కారణమైతే, ఇదే కేసును వ్యతిరేకిస్తున్న అంబటి రాంబాబు (Ambati Rambabu)తో కలిసి వేదిక పంచుకోవడం మరో కారణం. ఈ విషయంలో ఎదురైన విమర్శలకు ఆ తర్వాత ఏబీవీ వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

Former IPS Officer AB Venkateswara Rao Questions Caste Over Principles in Remarks on Ambati Bonda Uma

కానీ తాజాగా రాష్ట్రంలో కాపులంతా వివిధ సమస్యల విషయంలో పార్టీలకతీతంగా ఏకమవుతున్నారు. ఇందులో ముద్రగడ పద్మనాభం అంశం ఒకటి. ముద్రగడ మరణం తర్వాత రాష్ట్రంలో నిర్వహిస్తున్న సంతాప సభల్లో ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీ వైసీపీతో పాటు టీడీపీ, జనసేనలోని కాపు నేతలు కూడా హాజరవుతున్నారు. ఇదే క్రమంలో అంబటి రాంబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ (Bona Uma)కూడా వేదిక పంచుకోవడంతో పాటు ఆయనతో ఏదో మాట్లాడుతూ కూడా కనిపించారు. అయితే దీనిపై వెంటనే విమర్శలు రాలేదు. దీంతో మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

Former IPS Officer AB Venkateswara Rao Questions Caste Over Principles in Remarks on Ambati Bonda Uma

ఒక సూత్రం లేదా విధానం కోసం అయినప్పటికీ, అంబటితో కలిసి వేదిక పంచుకోకూడదా అంటూ గతంలో తనను విమర్శించిన వారిని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. బోండా మాత్రం అలా పంచుకోవచ్చు, ఎందుకంటే అది తన కులానికి సంబంధించిన విషయం, అంటే, సూత్రం కంటే కులమే అత్యంత పవిత్రమైనదా? ఇది మారాలి. సూత్రాలు లేకుండా కులం పునాదిపై నిర్మితమైన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందలేదంటూ తన విమర్శలకు ఏబీవీ చురకలు అంటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+