• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సజ్జల బ్రోకర్,జగన్ బెయిల్ రద్దు ఖాయం-అది నిరూపిస్తే తిరుపతిలోనే ఉరేసుకుంటా-గోనె ప్రకాశరావు సంచలన వ్యాఖ్యలు

|

మాజీ ఎమ్మెల్యే,రాజకీయ విశ్లేషకులు గోనె ప్రకాశరావు ఏపీ పాలనా వ్యవహారాలు,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఏపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అనే బ్రోకర్ ఉన్నాడని... కేబినెట్ రివ్యూలు,సీఎం ఫ్యామిలీ తగాదాలు అన్నీ ఆయనే చూస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ నుంచి ఇప్పటివరకూ ఎంతోమంది సీఎంలకు అడ్వైజర్లుగా పనిచేశారని... కానీ ఎవరూ మీడియా ముందుకు రాలేదని అన్నారు. ముఖ్యమంత్రి,సమాచార మంత్రి లేదా సంబంధిత మంత్రులే మీడియాకు వివరాలు వెల్లడిస్తారని... కానీ ఇక్కడ మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డే ఆ వ్యవహారాలు చూస్తున్నారని అన్నారు.

సజ్జల్ బ్రోకర్ అంటూ...

సజ్జల్ బ్రోకర్ అంటూ...

తెలంగాణలో సంతోష్ అనే శకుని ఉన్నాడని... అదే తరహాలో ఇక్కడ సజ్జల అనే బ్రోకర్ ఉన్నాడని విమర్శలు గుప్పించారు. బ్రోకర్ అంటే మీడియేటర్ అని అందులో తప్పేమీ లేదని అన్నారు. గతంలో తాను కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద బ్రోకర్ పనిచేశానని అన్నారు. 2004కి ముందు రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు... అసంతృప్తి నేతలతో సమావేశాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేస్తుండేవాడినని చెప్పారు.

వివేకా హత్యపై...

వివేకా హత్యపై...


వైఎస్ వివేకానంద హత్యపై గోనె ప్రకాశరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులు ఆయన్ను హత్య చేశారని... లేదా వారే హత్య చేయించి ఉంటారని ఆరోపించారు. స్వయంగా వివేకానంద రెడ్డి కూతురే ఈ విషయం చెప్పిందన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని అబద్దాలు చెప్పాడన్నారు. ఆరోజు వివేకానంద ఇంట్లో రక్తపు మరకలు అవినాష్ రెడ్డి ఎందుకు తుడిచేయించాడని ప్రశ్నించారు.

అది నిరూపిస్తే ఉరేసుకుంటా...

అది నిరూపిస్తే ఉరేసుకుంటా...


వైఎస్ విజయమ్మ రాసిన 'నాలో నాతో వైఎస్సార్' పుస్తకం గురించి ప్రస్తావిస్తూ... అందులో 172వ పేజీలో తప్పులు రాశారని అన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ పాదయాత్రలో జగన్ సంఘీభావంగా ఉన్నారని విజయమ్మ అబద్దాలు రాశారని చెప్పారు. అది తప్పుల తడక అని అన్నారు. వైఎస్ పాదయాత్ర చేసినప్పుడు అంబటి రాంబాబు,లగడపాటి రాజగోపాల్,భూమన కరుణాకర్ రెడ్డిలు మాత్రమే వెంట ఉన్నారని చెప్పుకొచ్చారు. వైఎస్ పాదయాత్రలో జగన్ ఎక్కడా పాల్గొనలేదన్నారు. ఒకవేళ జగన్ వైఎస్ పాదయాత్రలో పాల్గొన్నాడని నిరూపిస్తే తిరుపతిలోనే ఉరేసుకుంటానని సవాల్ విసిరారు.

  V.Hanumanta Rao Letter To AICC Over T Congress| TPCC | Oneindia Telugu
  జగన్ బెయిల్ రద్దు ఖాయం..

  జగన్ బెయిల్ రద్దు ఖాయం..


  వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మ షర్మిల దీక్షకు ఎలా మద్దతు తెలుపుతారని ప్రశ్నించారు. వైఎస్ విజయమ్మకు జగన్ ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదన్నారు.తనకు ఫోన్లు చేసి కొంతమంది బెదిరిస్తున్నారని... తాను బెదిరిపోయే వ్యక్తిని కాదని అన్నారు. తదుపరి ప్రెస్ మీట్ పులివెందుల లేదా ఇడుపులపాయలో పెడుతానని చెప్పారు. తనకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నవారి పేర్లు,ఊర్లు తెలుసునని... మీ ఇంటికొస్తా,ఊరికొస్తా అంటూ వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 4లక్షల మందికి ఉద్యోగాలు కల్పించానని చెప్పుకుంటున్న జగన్... వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటూ కనీస వేతనాలు కూడా చెల్లించట్లేదని అన్నారు. దీనిపై కోర్టుకు వెళ్తానని చెప్పారు. జగన్ బెయిల్ కచ్చితంగా రద్దవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెండేళ్ల పాలనలో ఏపీలో ఒక్క పరిశ్రమ,ఒక్క ఉద్యోగం రాలేదన్నారు. ఎక్కడా అభివృద్ది జరగలేదని విమర్శించారు.

  English summary
  Former MLA and political analyst Gone Prakash Rao expressed his anger on AP administration and Chief Minister YS Jagan Mohan Reddy. There is a broker named Sajjala Ramakrishnareddy in the AP ... who sits in Cabinet reviews,and solve even family issues,Gone Prakash Rao added.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X