నా కూతురు పద్మలత జోలికి రావొద్దని డిఎస్పీని హెచ్చరించా: మాజీ ఎమ్మెల్యే
పోలీస్ ఉన్నతాధికారి హోదాలో వున్న దాసరి రవిబాబు, తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగిన గేదెల రాజు తమను నమ్మించి మోసం చేశారని పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు ఆరోపించారు.మంగళవారం చినగుమ్ములూరులోని
విశాఖపట్నం: పోలీస్ ఉన్నతాధికారి హోదాలో వున్న దాసరి రవిబాబు, తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగిన గేదెల రాజు తమను నమ్మించి మోసం చేశారని పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు ఆరోపించారు.
మంగళవారం చినగుమ్ములూరులోని తన నివాసంలో విలేఖరులతో మాట్లాడారు. తమ కుమార్తె పద్మలత హత్యకు గురైందన్న విషయాన్ని సోమవారం వరకూ నమ్మలేదని, అయితే నగర పోలీసులు పరిశోధించి, ఆమె హత్యకు గురైందని నిర్ధారించడంతో నిర్ఘాంతపోయానన్నారు.

కూతురు జోలికి రావొద్దని అప్పట్లో రవిబాబును హెచ్చరించా
తన కుమార్తె జోలికి రావద్దని పదేళ్ల కిందట అప్పట్లో సీఐగా ఉన్న రవిబాబును తీవ్రంగా హెచ్చరించానని, కానీ అతను చేతులకు మట్టి అంటకుండా, తమ కుటుంబంతో సన్నిహితంగా ఉండే గేదెల రాజును పావుగా వాడుకుని ఆమెను అంతం చేస్తాడని ఊహించలేకపోయానన్నారు.

కుట్రలో భాగమే అనుకుంటున్నాం
గేదెల రాజు కూడా తమకు అనుమానం రాకుండా పద్మలతను హత్య చేసిన రోజు తన కుమారుడిని కూడా కారులో ఎక్కించుకోవడం అతని కుట్రలోని భాగంగా భావిస్తున్నానని చెప్పారు. తన కుటుంబానికి సంబంధించి ఏ విషయం అయినా డైరీలో రాసుకునే అలవాటు ఉందని నూకరాజు చెప్పారు.

గేదెల రాజు బిర్యానీ పెట్టించాడు
తన కుమార్తె గత ఏడాది సెప్టెంబర్ 22న చనిపోయిందని, కానీ అంతకుముందు ఆగస్టు 29న విశాఖ వెళ్లినప్పుడు గేదెల రాజు గాజువాకలోని ఒక హోటల్‌కు తీసుకువెళ్లి బిర్యానీ పెట్టించాడని, అప్పుడే అందులో విషం కలిపి ఉంటాడని అనుమానిస్తున్నట్టు చెప్పారు. హోటల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే తన కుమార్తె కింద పడిపోయిందని, వెంటనే కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లి ఒక ఆసుపత్రిలో చేర్పించాడన్నారు.

విషం తీసుకున్నదని చెప్పాడు
ఈ విషయం తెలుసుకుని తాము ఆసుపత్రికి వెళ్లామని, పద్మలత ఆత్మహత్య చేసుకోవడానికి విషం తీసుకుందని గేదెల రాజు చెప్పాడని, ఆ తర్వాత తన కుమార్తెను అడిగితే తాను ఏ విషం తీసుకోలేదని చెప్పిందని తెలిపారు. పోలీస్ అధికారి రవిబాబు చేసిన మోసం వల్ల ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటుందని అప్పుడు భావించానని, తమ కుటుంబానికి సన్నిహితుడు కావడంతో గేదెల రాజు మీద తనకు అనుమానం రాలేదన్నారు.

ఆ తర్వాత చనిపోవడంతో
సుమారు నెల రోజుల తర్వాత తన కుమార్తె చనిపోయిందని, అనారోగ్యం కారణంగానే మృతి చెందిందని భావించి సహజ మరణంగా భావించానని, కానీ పోలీసుల విచారణలో ఆమెది హత్యే అని వెల్లడి కావడంతో ఆశ్చర్యపోయానన్నారు.

పోలీస్ అధికారిని కఠినంగా శిక్షించాలి
తన కుమార్తెను బలిగొన్న గేదెల రాజు హత్యకు గురికావడం ద్వారా ఇప్పటికే శిక్షింపబడ్డాడని, పోలీస్ అధికారి రవిబాబును కఠినంగా శిక్షించాలని కాకర నూకరాజు డిమాండ్ చేశారు. ఇటీవల తన కుమారుడితో కలిసి విశాఖ వెళ్లి, పోలీసులు అడిగిన వివరాలను తెలియజేశానని చెప్పారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications