ఏపీ రాజకీయాల్లో విషాదం.. గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ !
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనంతపురం మాజీ లోక్‌సభ సభ్యుడు దరూరు పుల్లయ్య గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం కర్ణాటక లోని బళ్లారిలో ఆయన నివాసం ఉంటున్నారు. సోమవారం నాడు ( మే 12, 2025 ) బళ్లారి నుంచి కంప్లి కొట్టాలలో ఉన్న తన పొలాన్ని చూడడానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కంప్లిలో స్నేహితులతో మాట్లాడేందుకు కారు దిగగా అక్కడే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు.
పుల్లయ్య పార్థివ దేహాన్ని బళ్లారిలోని తన ఇంటికి తీసుకెళ్లారు. ఆయన సొంతూరు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం. ఆయనకు భార్య సత్యవతి, ఆరుగులు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మద్రాస్ లో లా పూర్తి చేశారు. పుల్లయ్య మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ నెల 14వ తేదీ, బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, కమ్మ సంఘం నేతలు సంతాపం తెలిపారు.

ఉరవకొండ నియోజకవర్గం నుంచి 1962లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
1968 నుంచి 1974 వరకు ఉరవకొండ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా రెండు సార్లు గెలుపొందారు.
1977-79, 1982-85 మధ్య అనంతపురం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు.
కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.
1965 నుంచి 1977 వరకు కంప్లి షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్‌గా, బీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్‌గా విధులు చేపట్టారు.












Click it and Unblock the Notifications