నేడు తారకరత్న వర్ధంతి -సాయిరెడ్డి ఎమోషనల్ ట్వీట్..!
టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న (nandamuri taraka ratna) మూడో వర్ధంతి నేడు. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పానికి వచ్చిన నందమూరి తారకరత్న 2013 ఫిబ్రవరి 18న తీవ్ర గుండెపోటుకు గురై ఆస్పత్రికి తరలించే సరికి చనిపోయారు. ఆ తర్వాత ఆయన కుటుంబానికి దగ్గర బంధువైన అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai Reddy)ఆస్పత్రిలో తారకరత్న కుటుంబాన్ని ఓదారుస్తూ కనిపించారు. అప్పుడే సాయిరెడ్డి-తారకత్న బంధువులన్న సంగతి అందరికీ తెలిసింది.
అయితే ఇవాళ తారకరత్న మూడో వర్థంతి సందర్భంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఆయన్ను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇందులో నందమూరి తారక రత్న మూడవ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నట్లు సాయిరెడ్డి తెలిపారు. చాలా త్వరగా ఆయన మన మధ్య నుండి వెళ్ళిపోయారు, ఆయన చాలా మంది జీవితాలను తాకిన ఆప్యాయత, వినయం మరియు అంకితభావం యొక్క జ్ఞాపకాలను మిగిల్చారని గుర్తుచేశారు.

Remembering Nandamuri Taraka Ratna on his third death anniversary. Gone too soon, he left behind memories of warmth, humility and dedication that touched many lives. I still remember the shock and deep sadness his passing brought and the silence it left in the hearts of those who… pic.twitter.com/SQ2IvMg8hZ
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 18, 2026
తారకరత్న మరణం కలిగించిన షాక్, లోతైన విచారం, ఆయనను అభిమానించే వారి హృదయాలలో మిగిల్చిన నిశ్శబ్దం తనకు ఇప్పటికీ గుర్తున్నాయని సాయిరెడ్డి తెలిపారు. ఆయనను ఎప్పుడూ మిస్సవుతూనే ఉంటామని, ప్రేమగా గుర్తుంచుకుంటామని సాయిరెడ్డి తన ట్వీట్ ను ముగించారు. తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్. తారకరత్న ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ ఏకైక కుమారుడు. తారకరత్నకు ఒకేసారి 9 సినిమాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వరల్డ్ రికార్డు సృష్టించిన చరిత్ర ఉంది. 39 ఏళ్ల వయస్సులోనే ఆయన గుండెపోటుతో చనిపోయారు.
-
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
ఇదేం టీజర్ రా బాబోయ్.. మహేష్ అన్నకొడుకు ఏడిపించాడు భయ్యా.. మరో ఆర్ఎక్స్ 100..! -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications