తిరుమల లడ్డూలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందన, చంద్రబాబుతో
తిరుమల శ్రీవారి ప్రసాదాలు విషయంలో వస్తున్న వార్తలను చూసి తాను తట్టుకోలేక పోతున్నామని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కోట్లాదిమంది భక్తులు ఉన్నారని, కోట్లా మందికి శ్రీవారు ఇంటి ఇలవేల్పు అని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. కోట్లాదిమంది భక్తులు మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల లడ్డు ప్రసాదాలు తయారు చేశారని వార్తలు రావడం తనకు ఎంతో బాధ కలిగించిందని ఎం. వెంకయ్య నాయుడు అన్నారు.
ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపించి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తాను సూచించానని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. శుక్రవారం తాను సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడానని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఎంతో భక్తితో తిరుమలలో లడ్డు ప్రసాదాలు తీసుకుంటారని ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు.

తిరుమల లడ్డూ ప్రసాదం తింటే వారి పాపాలు, కష్టాలు తొలగిపోతాయని శ్రీవారి భక్తులు నమ్ముతారని, ఆ లడ్డు ప్రసాదాలు తీసుకెళ్లి ఎంత పవిత్రంగా వారి బంధువులు, స్నేహితులకు పంచిపెడతారని, ప్రతి ఒక్కరు తిరుమల ప్రసాదాన్ని ఎంతో భక్తితో స్వీకరిస్తారని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. అలాంటి తిరుమల లడ్డు ప్రసాదాల విషయంలో ఇలాంటి వార్తలు రావడం చాలా బాధాకరమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో నాణ్యతతో పాటు పవిత్రత కూడా ఎంతో కీలకమని, చిన్నపాటి దోశమైన క్షమించడానికి నేరమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. తిరుమల లడ్డుల తయారి విషయంలో వస్తున్న వార్తలపై సమగ్ర దర్యాప్తు జరిపించి నిజా నిజాలు బయటకు తియ్యాలని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు సూచించానని ఎం. వెంకయ్య నాయుడు అన్నారు.
మరొకసారి తిరుమల లడ్డుల విషయంలో ఇలా చేయాలంటే భయపడేలా కఠిన చర్యలు ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడుకు తాను సూచించానని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. తాను ఇచ్చిన సూచనలకు సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమ్మతించారని వెంకయ్య నాయుడు అన్నారు,. కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే వారు ఎవరైనా సరే వారి పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి సూచించామని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఎక్స్ లో పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications