చంద్రబాబు పెట్టబడులే సింగపూర్ లో..! సీక్రెట్ చెప్పిన వైసీపీ మాజీ మంత్రి..!
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ ఇవాళ ప్రారంభమైంది. ఈ టూర్ లో భాగంగా చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తారంటూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అన్నట్లుగానే ఇవాళ చంద్రబాబు ఉదయం సింగపూర్ లోని భారత హైకమిషనర్ తోనూ, స్థానిక పారిశ్రామికవేత్తలతోనూ భేటీలు నిర్వహించి రాష్ట్రంలో అనుకూలతల్ని వారికి వివరించారు. అయితే నిర్దిష్టంగా ఎలాంటి హామీ మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ చంద్రబాబు టూర్ వెనుక రహస్య కారణముందని ఆరోపించింది.
చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సింగపూర్ ను మాత్రం మర్చిపోరని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆరోపించారు. 1995 నుంచి దాదాపు మూడు దశాబ్దాలుగా సింగపూర్ తో సంబంధం అన్నాు. ఆయన పెట్టుబడులు, అవినీతి సామ్రాజ్యం అంతా సింగపూర్ లోనే అని చెబుతుంటారన్నారు. యూరో లాటరీ వ్యవహారంలో పట్టుబడిన కోలా కృష్ణమోహన్ గతంలోనే తనకు ఎంపీ సీటు కోసం చంద్రబాబు నాయుడు రూ.5 కోట్లు నగదు బదిలీ చేయమంటే.. సింగపూర్ లో ఓ అకౌంట్ కు చేశానని స్టేట్ మెంట్ ఇచ్చారని గుడివాడ గుర్తుచేశారు.

ఉమ్మడి రాష్ట్రంలోనే రాజకీయంగా అవగాహన ఉన్న ఎవరిని అడిగినా చంద్రబాబు పెట్టుబడులన్నీ సింగపూర్ లోనే అని చెప్తారని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అమరావతి, సింగపూర్ ఒకటే పాట అన్నారు. అమరావతిని సింగపూర్ చేస్తానని ఇక్కడి రైతులను విమానాలలో సింగపూర్ కూడా తీసుకెళ్లడానికి వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నారు. సింగపూర్ మంత్రిని కూడా ఇక్కడికి తీసుకొచ్చారన్నారు. తీరా 2019లో ఓడిపోయిన తర్వాత.. ఆయన కీర్తించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ను అవినీతి ఆరోపణలతో చర్యలు తీసుకున్నారన్నారు.

ఆ రోజుల్లో సింగపూర్ ఈశ్వరన్, ఆంధ్రా చంద్రబాబు కవలపిల్లల్లా తిరిగారని, అలాంటి ఈశ్వరన్ ను అవినీతి ఆరోపణలతో శిక్షించారని వైసీపీ మాజీ మంత్రి తెలిపారు. వాస్తవానికి అతితక్కువ అవినీతి, అత్యంత కఠినమైన అవినీతి నిరోధక చట్టాలు, పారదర్శక పాలన ఉన్న దేశం సింగపూర్ అని, అలాంటి సింగపూర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ అవినీతికి పాల్పడిన ఈశ్వరన్ తో చంద్రబాబుకి సత్సంబంధాలు ఉన్నాయంటే వీరి బంధాన్ని అర్ధం చేసుకోవచ్చన్నారు. నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు సింగపూర్ నుంచి ఏపీకి తీసుకొచ్చిన పెట్టుబడులు కన్నా... ఇక్కడ అవినీతి చేసి మీరు దోచుకెళ్లి సింగపూర్ లో పెట్టిన పెట్టుబడులే ఎక్కువన్నారు. సింగపూర్ పర్యటన ఈశ్వరన్ తో ములాఖత్ కోసం వెళ్లినట్టుందన్నారు.












Click it and Unblock the Notifications