Kodali Nani: వచ్చే ఎన్నికలపై కొడాలి నాని లెక్క ఇదే..!
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అధికార వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. విపక్షాలు ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్ధితిపై పలు సర్వేలు కూడా ఫలితాలు ప్రకటిస్తున్నాయి. దీంతో రాజకీయ పార్టీల్లనూ ఆందోళన పెరుగుతోంది. ఈ తరుణంలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని వచ్చే ఎన్నికల ఫలితాలపై తనదైన జోస్యం చెప్పారు.
సూర్యుడు పడమర ఉదయించినా సరే.. సీఎంగా జగనే ప్రమాణస్వీకారం చేస్తారంటూ కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.మే నెలాఖరున సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయకుండా ఆపగలిగే మగాడు రాష్ట్రంలో లేడన్నారు. చంద్రబాబు, పవన్, వదినమ్మ, చెల్లెమ్మ, మోడీ, సోనియా ఎంతమంది కలిసి వచ్చినా సరే అన్నారు. సీఎం జగన్ ను అధికారం నుండి దింపగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవన్నారు. జగన్ సైకో అని ప్రతిపక్షాలు ఎలా అనగలుగుతున్నాయని కొడాలి ప్రశ్నించారు.

నవ్వుతూ జైలుకెళ్ళిన సీఎం జగన్, 16 నెలల తర్వాత కూడా అదే చిరునవ్వుతో బయటకు వచ్చాడని కొడాలి తెలిపారు.జగన్ ముఖంలో నవ్వు తప్ప మరొకటి కనిపించదన్నారు. మాడు ముఖం, చించుకోవడం, ఫ్రస్టేషన్, గంతులు వేయడం ఇది ప్రతిపక్షాల తీరన్నారు. ఇలాంటి సైకోలందరూ కలిసి జగన్ ను వేధిస్తున్నారన్నారు. 58 నెలల పాలనలో ఆర్థిక సమస్యలు తలెత్తినా, కరోనా ఇబ్బందులు వచ్చినా, ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా జగన్ పాలించాడన్నారు. అదే చంద్రబాబు అయితే ఇంట్లో పడుకొని, కరోనా కష్టాలతో ప్రజలను పస్తులుంచేవాడని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications