నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి!
నెల్లూరు: నెల్లూరు జిల్లా పెళ్లకూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీపును బస్సును ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 8మందికి గాయాలయ్యాయి.
గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తుఫాను వాహనంలో తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వినాయక ట్రావెల్స్ కి చెందిన బస్సు వీరు ప్రయాణిస్తున్న తుఫానును ఢీకొట్టింది.

ప్రమాద సమయంలో తుఫాను వాహనంలో 15మంది ఉన్నట్టు సమాచారం. గాయపడ్డవారిని నాయుడుపేట ఆసుపత్రికి చికిత్స తరలించారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications