ఏలూరులో విషాదం: బాలుడి ప్రాణం తీసిన చిప్స్.. తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు

Subscribe to Oneindia Telugu

ఏలూరు: చిప్స్ ప్యాకెట్ ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలిగొంది. చిప్స్‌తో పాటు ప్యాకెట్‌లో వచ్చిన బొమ్మను మింగి ఆ చిన్నారి ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులోని కుమ్మరి రేవులో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కమ్మరిరేవులో నివసించే దంపతులకు నిరీక్షణ్‌ కుమార్‌(4) అనే కుమారుడు ఉన్నాడు. బుధవారం ఉదయం తల్లితో కలిసి పాల ప్యాకెట్ కొనడం కోసం స్థానిక దుకాణానికి వెళ్లాడు. అక్కడ 'డైమండ్ రింగ్స్' చిప్స్ ప్యాకెట్ చూసి తల్లిని అది కొనివ్వమన్నాడు.

four years old dies after swallowed toy got in chips pack

ఇంటికి వచ్చాక.. చిప్స్ తింటున్న క్రమంలో.. పొరపాటున అందులో ఉన్న బొమ్మను కూడా మింగేశాడు. దీంతో ఊపిరాడక విలవిల్లాడిపోయాడు. వెంటనే బాలుడిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
4 Years-Old Boy Dies after swallowed a toy that came in a Packet of chips

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి