కప్ప నోట్లో త్రాచుపాము, మింగేందుకు ప్రయత్నాలు

ఈ క్రమంలో ఆ పాము కాస్తంత పక్కకు జరిగి పడగ విప్పి కాటేస్తున్న సంఘటన ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరుగుతూనే ఉంది. ఈ వింతను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో ప్రజల అలికిడికి భయపడిన కప్ప డ్రైజేజీ లోపలికి వెళ్లిపోయింది.
కాగా, అనంతపురం జిల్లాలో ఓ భారీ అనకొండ గొర్రెను మింగిన సంఘటన జరిగిన విషయం తెలిసిందే. పుట్టపర్తి మండలంలోని రాచువారిపల్లి సమీపంలో ఆదివారం కనుమకొండ సమీపంలో కొండ చిలువ గొర్రె పిల్లను మింగేసింది. గ్రామస్థులు కనుగొని కొండచిలువను అటవీ అధికారులకు అప్పగించారు.
గ్రామానికి చెందిన కేశవయ్య గొర్రెలను మేపేందుకు కనుమ కొండకు వెళ్లగా అక్కడ కొండ చిలువ గొర్రె పిల్లను మింగేసింది. కాపరుల ద్వారా సమాచారం తెలియడంతో కొండ చిలువను చూడడానికి గ్రామస్థులు భారీ సంఖ్యలో కనుమకొండకు చేరుకున్నారు. ఈ కొండ చిలువ పదిహేను అడుగులు ఉంది. గొర్రెను మింగిన కొండ చిలువ ఎటు కదలలేకపోయింది.
దీంతో గ్రామస్థులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చెప్పారు. పెనుకొండ సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారికి విషయం తెలపడంతో ఆయన సోమందేపల్లి బీట్ ఆఫీసర్ రామకృష్ణ, సబ్ బీట్ ఆఫీసర్ వెంకటేశులులను సంఘటనా స్థలానికి పంపించారు. వారు ఆ కొండ చిలువను గోనె సంచిలో బంధించి అడవిలో వదిలి పెట్టారు.












Click it and Unblock the Notifications