ఏపీలోని అన్ని జిల్లాలకు నిధులు మంజూరు- అత్యవసర ఫోన్ నంబర్లు

బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాన్ మొంథా.. మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ భీతావహంగా మారుతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్.. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. తీరాన్ని దాటుతున్న సమయంలో అంచనాలకు అందని విధంగా బీభత్సాన్ని సృష్టించే అవకాశాలు లేకపోలేదు. పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు దక్షిణ ప్రాంతం వరకూ అతి భారీ వర్షాలకు కారణమౌతోంది.

ప్రస్తుతం ఈ మొంథా తుఫాన్ బంగాళాఖాతం నైరుతి, పశ్చిమ-మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమైందీ మొంథా తుఫాన్. చెన్నైకి తూర్పు-ఆగ్నేయ దిశగా 640, విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయం దిశలో 740, కాకినాడకు ఆగ్నేయ దిశలో 710, ఒడిశాలోని గోపాల్‌పూర్ కు దక్షిణ-ఆగ్నేయ దిశలో 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. మంగళవారం ఉదయానికి పెను తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Funds release for the All districts in Andhra Pradesh inview of Cyclone Montha

క్రమంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అదే రోజు రాత్రికి మచిలీపట్నం- కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో తీరం వెంబడి గంటకు 90 నుండి 110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, దీని తీవ్రత 110 కిలోమీటర్ల వరకు పెరగవచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే- పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరిల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.

సన్నద్ధతలో భాగంగా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు మొత్తం 19 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కోటి రూపాయలు చొప్పున, చిత్తూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాలకు రూ. 50 లక్షలు చొప్పున నిధులు మంజూరయ్యాయి..

లోతట్లు ప్రాంతాల నివాసులు, భారీ వర్షాలు, వరద ప్రభావానికి గురయ్యే వారిని సహాయ శిబిరాలకు తరలించడం, తాగునీరు, ఆహారం, పాలు అందించడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు అత్యవసర మరమ్మతులు, ఇతర సహాయ కార్యకలాపాలు కోసం ఈ నిధులను వినియోగించాల్సి ఉంటుంది. అలాగే- అత్యవసర సహాయ నంబర్లతో 112, 1070, 1800 425 0101 కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది.

అనకాపల్లి, కాకినాడ, కోనసీమ కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఎస్పీలతో హోం మంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో 100 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటం వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోతాయని, విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని, తుఫాన్ అనంతరం వాటిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరించాలని సూచించారు. ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, జేసీబీలు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.

భారీ హోర్డింగులను తొలగించాలని, మెడికల్ ఎమర్జెన్సీ కోసం అంబులెన్సులు ఏర్పాటు చేయాలని అన్నారు. కాకినాడ జిల్లాలో ఆరు మండలాలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో ఎక్కువ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్డు బ్లాక్ అయితే డైవర్షన్స్ మ్యాప్ ముందే సిద్ధం చేసుకోవాలని, జిల్లా, మండల కంట్రోల్ రూమ్ నెంబర్లు ప్రతి ఒక్కరికి చేరేలా చూడాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+