కేసులు: కోర్టులకు హాజరైన జగన్, గాలి జనార్దన్ రెడ్డి
హైదరాబాద్: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు విచారణకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సోమవారంనాడు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ నిమిత్తం ఆయన తన సోదరుడు శ్రీనివాసరెడ్డితో కలిసి కోర్టుకు వచ్చారు.
ఈ కేసులో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా కోర్టు విచారణకు హాజరయ్యారు. నిందితులను విచారించిన న్యాయమూర్తి కేసు తదుపరి విచారణకు సెప్టెంబర్ 18కి వాయిదా వేశారు.

కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైదరాబాదు నాంపల్లిలో ఈడీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న జగన్‌పై సీబీఐతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
జగన్‌తో పాటు ఈ కేసులో రెండో ముద్దాయిగా ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పా్టీ ప్రధాన కార్యదర్శి, జగన్ సంస్థల ఆడిటర్ విజయసాయిరెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి సెప్టెంబర్ 14కు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications