కెసిఆర్‌ను అరెస్ట్ చేయాలి: ట్యాపింగ్‌పై ఆధారాలున్నాయన్న గాలి
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమని, ఈ నేరానికి పాల్పడిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును కేంద్రం వెంటనే అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యాన్ ట్యాపింగ్ కేసులో మొదటి దోషి సిఎం కెసిఆర్ అని, రెండో దోషి ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ అని ఆరోపించారు.
తమ వద్ద ఫోన్ ట్యాపింగ్‌పై స్పష్టమైన ఆధారాలున్నాయయని ముద్దుకృష్ణమ తెలిపారు. సిగ్గులేకుండా తప్పుడు కేసుల పెట్టి ఏపి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నారని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. హైదరాబాద్ పదేళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఇక్కడ ఇద్దరు సిఎంలకు అధికారలుండవని, గవర్నర్‌కు మాత్రమే అధికారాలుంటాయని చెప్పారు.

తెలంగాణ ఏసిబి అధికారులు గవర్నర్ అనుమతి లేకుండా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హైదరాబాద్‌లో పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకుంటుందని తెలిపారు. ఏపి ఉద్యోగులు తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు ఇక్కడ తమ ప్రభుత్వానికి పోలీస్ స్టేషన్లు అవసరమని చెప్పారు.
ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో గవర్నర్‌కే అన్ని అధికారాలుంటాయని, తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించినా, చివరి నిర్ణయాధికారం గవర్నర్‌దేనని గాలి ముద్దుకృష్ణమ అన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌పై ఏపి ప్రభుత్వానికి కూడా హక్కు ఉంటుందని తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications