టిడిపిలోకి గల్లా జయదేవ్, హీరో కృష్ణ గ్రామం నుండి...

ఎన్నికల రోజు నాకివ్వండి: చంద్రబాబు
ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన చారిత్రక అవసరాన్ని ప్రజలు గుర్తించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. 'ఎన్నికల రోజును నాకు ఇవ్వండి.. 5 ఏళ్లు ప్రజాసేవ చేస్తాను' అని ఆయన చెప్పారు. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన టిడిపి నేతలు భాస్కర రావు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్‌చార్జి వివేక్ ముద్రించిన క్యాలెండర్లను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
టిడిపి అధికారంలోకి వస్తే పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లి ఖర్చులన్నీ ప్రభుత్వం భరించేలా ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తామని చంద్రబాబు డ్వాక్రా గ్రూపు మహిళలతో అన్నారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందనుకొనే రోజులు తెస్తామని, ఆడపిల్ల పుట్టగానే ప్రభుత్వం తరఫున పాతికవేల రూపాయలు డిపాజిట్ చేస్తామని, మహాలక్ష్మి పేరుతో తాము ఈ పథకం ప్రకటించిన తర్వాత ప్రభుత్వం పోటీగా బంగారు తల్లి పథకం ప్రకటించిందన్నారు. కానీ, అది నీరుగారిందన్నారు.
పుట్టబోయే ఆడపిల్లలకేకాక, ఇప్పటికే పుట్టిన ఆడపిల్లల పెళ్లిళ్లకూ సాయం చేయాలని నిర్ణయించామన్నారు. మహిళలు వారి కాళ్లపై వారు నిలబడేలా డ్వాక్రా ఉద్యమాన్ని తాను ప్రారంభిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలను రుణాల ఊబిలోకి నెట్టి చేతులు దులుపుకొందని, తాను వస్తే రుణాలు మాఫీ చేయడంతోపాటు అన్ని డ్వాక్రా సంఘాలకు కొత్త రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారుకు మరణ దండనే సరి అన్నారు. అవినీతి దొంగల ఆటకట్టిస్తే స్త్రీల సమస్యలు తీరుతాయన్నారు.












Click it and Unblock the Notifications