విద్యార్థుల మద్య గ్యాంగ్ వార్, రాళ్ళు రువ్విన విద్యార్థులు
పెనమలూరు: కృష్ణా జిల్లాలో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ గురువారం నాడు చోటు చేసుకొంది. విద్యార్థులు పరస్పరం రాళ్ళదాడి చేసుకొన్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ దాడులు చోటు చేసుకొన్నాయి.
పెనమలూరులో విద్యార్థుల గ్యాంగ్ వార్ జరిగింది. కర్రలు, రాళ్ళతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో లో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై విద్యార్థులు కర్రలతో దాడి చేసి కెమెరాలను ధ్వంసం చేశారు.

పెనమలూరు పోలీస్‌స్టేషన్ ఎదురుగానే ఈ బీభత్సకాండ జరిగింది. విద్యార్థులు రాళ్ళు రువ్వుతుండటంతో స్టేషన్ నుంచి పోలీసులు బయటకురాలేకపోయారు. స్థానికులు భయంతో తలుపులు వేసుకున్నారు. ఓ ప్రైవేట్ హాస్టల్‌కు చెందిన విద్యార్థుల మధ్య విభేదాలే దాడికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు పరస్పరం రాళ్ళు రువ్వుకొన్నారు. అయితే ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications