హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్‌తో ఏపీ మంత్రి గంటా భేటీ.. ఎంసెట్‌పై చర్చ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్‌తో ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం రాజ్ భవన్‌లో సమావేశమయ్యారు. ఎంసెట్ నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వంతో తలెత్తిన వివాదాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఎంసెట్‌ను రెండు రాష్ట్రాలు కలిసి నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుంటే.. తెలంగాణ మాత్రం తామే నిర్వహించుకుంటామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి గంటా, ఉన్నతవిద్యామండలి చైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి గవర్నర్‌‌ను కలిసి ఎంసెట్‌ ఉమ్మడి నిర్వహణపై చర్చించారని సమాచారం.

 Ganta Srinivas Rao meet with Governor Narasimhan over EAMCET exam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 10వ షెడ్యూల్‌ల్లో పేర్కొన్న ప్రకారం ఎంసెట్‌ నిర్వహణ ఏపీ ఉన్నత విద్యామండలి పరిధిలోనే జరగాలని, పదేళ్లపాటు ఎంసెట్‌ ఉమ్మడిగానే నిర్వహించాలని ఉందని... ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని గవర్నర్‌ను మంత్రి గంటా కోరినట్లు తెలుస్తోంది.

ఎంసెట్‌ను ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించని తరుణంలో హైదరాబాద్‌లో ఉన్న విద్యార్థులు నష్టపోయి అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా తన వాదనను వినిపించినట్లు తెలుస్తోంది.

English summary
Minister Ganta Srinivas Rao meet with Governor Narasimhan over EAMCET exam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X