కరెంట్ కట్: సిఎండిపై మత్రి గంటా ఫైర్ (పిక్చర్స్)
విశాఖపట్నం: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి శేషగిరిబాబుపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉత్తరాంధ్ర జిల్లాల విద్యా శాఖాధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడుతుండగా కరెంట్ పోయింది.
పది నిమిషాల పాటు కరెంట్ రాకపోవడంతో నగరానికి చెందిన శాసనసభ్యులు అధికారులు కొంత ఇబ్బందికి గురయ్యారు దీంతో గంటా శ్రీనివాస రావు విద్యుచ్ఛక్తి సంస్థ సిఎండికి ఫోన్ చేసి వేళాపాళా లేకుండా కరెంట్ ఎలా తీస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రోజు జిల్లా పరిషత్‌లో సమీక్షా సమావేశం జరుగుతోందని తెలియదా, రోజూ పత్రికల చదవరా అంటూ శేషగిరిబాబుపై మండిపడ్డారు. మధ్యాహ్న భోజన పథకంపై, డ్రాపౌట్స్‌పై, పాఠశాలల తనిఖీలపై, బాలల హక్కుల విభాగానికి వస్తున్న ఫిర్యాదులపై గంటా సమీక్ష నిర్వహించారు.

మంత్రి గంటా మండిపాటు
ఉత్తరాంధ్ర విద్యాశాఖాధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతుండగా కరెంట్ పోవడంతో మంత్రి గంటా శ్రీనివాస రావు విద్యుచ్ఛక్తి ఉన్నతాధికారికి ఫోన్ చేసి మండి పడ్డారు.

పత్రికలు చదవరా...
పత్రికలు చదవరా, ఈ రోజు సమీక్షా సమావేశం ఉందని తెలుసు కదా, కరెంట్ తీసేస్తే ఎలా అని సిఎండి శేషగిరిబాబుపై మంత్రి ఆగ్రహించారు.

మంత్రి సమీక్ష
విద్యాధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా కరెంట్ పోవడంతో మంత్రితో పాటు అందరూ ఇబ్బందులకు గురయ్యారు.

మంత్రి ఫోన్, మండిపాటు
విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు సిఎండికి ఫోన్ చేసి, కరెంట్ కట్‌పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications