వెంట పడి ప్రేమ వేధింపులు: అమ్మాయి అత్మహత్య

అదే గ్రామానికి చెందిన ఎల్లాపుల శివ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆ బాలిక వెంటపడుతూ వేధిస్తూ వచ్చాడు. విషయం తెలిసిన బాలిక తండ్రి రాజన్న అతన్ని పలుమార్లు మందలించాడు. అయినా అతను తన పద్ధతిని మార్చుకోలేదు.
ఆ యువకుడి వేధింపులతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా అమ్మాయి మార్గమధ్యంలో మరణించింది.
బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications