గాలిపటం ఎగరేస్తూ.. డాబాపై నుంచి పడి మృతి, తల్లి కన్నీరుమున్నీరు (ఫోటోలు)
విశాఖ: ఏపీలోని విశాఖలో బుధవారం ఓ ఇంట విషాదం చోటు చేసుకుంది. మేడ పైన గాలి పటం ఎగరవేస్తూ ఓ బాలిక కిందపడి మృతి చెందింది. ఏడాది కిందటే ఆ బాలిక తండ్రి మృతి చెందాడు. ఇప్పుడు బాలిక చనిపోయింది. బాలిక మృతితో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.
పాత జైలు రోడ్డులోని గొల్లలపాలెం ఆర్టీ క్లబ్ సమీపంలో ఉండే అరుణకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు మానస డాబా గార్డెన్సులోని ప్రేమ సమాజం పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది.
బుధవారం సాయంత్రం సోదరితో కలిసి గాలిపటాలు ఎగరవేసేందుకు ఇంటి మేడ పైకి వెళ్లింది. పాలిథీన్ కవర్‌కు దారం కట్టి గాలిపటంలా ఎగరవేసుకుంటూ.. ముందుకు పోయింది. ఆ పాలిథీన్ కవర్ విద్యుత్ స్తంభం తీగలకు చుట్టుకుంది. దంతో దానిని తప్పించేందుకు వెనక్కి వెళ్లిన మానస మేడ పై నుంచి కిందపడింది.

అడుగు ఎత్తు మాత్రమే ఉన్న పిట్టగోడ పై నుంచి కిందపడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు, తల్లి అరుణ కలిసి మానసను కెజిహెచ్ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే మానస మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
కాగా, అరుణ భర్త ఏడాది కిందటే అనారోగ్యంతే మృతి చెందాడు. అరుణ ఇంటి వద్దే పాన్ షాప్ పెట్టుకుంటూ పిల్లల్ని పోషించుకుంటోంది. కూతురు మృతదేహం వద్ద అరుణ కన్నీరుమున్నీరయింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేకపోయింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications